Latest Malayalam OTT releases : జనవరిలో ఓటీటీలో విడుదలలైన కలాంకావల్, భా భా బా సినిమాలతో పాటు, మరికొన్ని మలయాళం సినిమాలను చూసి ఈ వీకెండ్ మరో సారి ఆడియన్స్ పండుగ చేసుకోవచ్చు. ఇవి ZEE5, Sony LIV, netflix , Sun NXT ఓటీటీలలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో థ్రిల్లర్ ల నుంచి లవ్ స్టోరీల దాకా ఆడియన్స్ ని చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఈ సినిమాల వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ థ్రిల్లర్ సినిమాను థియేటర్లలో చూడలేని చాలా మంది ఓటీటీలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ సినిమాని డిజిటల్ గా చూసి ఆనందిస్తున్నారు. ఈ సినిమా కొట్టాయికోనంలో జరిగే పోలీసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. వరుస క్రూరమైన హత్యలు చేస్తున్న ఒక కిల్లర్ ని పట్టుకునే క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది. సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్ ఆధారంగా రూపొందింన ఈ సినిమాలో విలన్ స్టాన్లీ దాస్‌గా మమ్ముట్టి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది సోనీ LIVలో జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
కేరళ ముఖ్యమంత్రిని కిడ్నాప్ తర్వాత ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. మోహన్ లాల్ అతిధి పాత్రలో ఆకట్టుకున్నా, మిగతా బలమైన తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
థ్రిల్లర్ అభిమానులు ఒకసారి చూడదగ్గ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఇది. నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడిన ఈ కథనం, కొట్టాయం ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న పట్టణంలో 2005లో మరణించిన ఒక అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. 2023 లో వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇది సన్ NXT లో జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది.
ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రాన్ని ఆరాద్య స్టూడియోస్ బ్యానర్‌పై MRK జయారామ్ నిర్మించారు. ఒక మారుమూల ప్రాంతంలో జరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులు వస్తూనే ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా డిసెంబర్ 31 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది.
చాలా కాలం క్రితం విడిపోయిన అనీష్, అంజన అనే మాజీ ప్రేమికులు తిరువనంతపురంలో ఒక రోజు అనుకోకుండా కలుస్తారు. వాళ్ళు ఆ రోజు నగరంలో తిరుగుతూ తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. జరీన్ షిహాబ్, రోషన్ మాథ్యూల నటన ఈ సినిమాకి హైలెట్ గా ఉంటుంది. Sun NXT, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : టైమ్ ట్రావెల్ చేసి అమ్మాయిల ప్రపంచంలో ఇరుక్కునే అబ్బాయిలు… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా