Latest Tamil OTT releases : జనవరి 2026లో కొత్త తమిళ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానున్నాయి. అలాగే థియేటర్లలో కూడా అడుగుపెట్టనున్నాయి. ఇక విజయ్ నటించిన జన నాయగన్ సినిమా పొంగల్ విడుదల నుండి వాయిదా పడిన విషయం తెలిసిందే. వా వాతియార్, తంబి తలైవర్ తలైమైల్ వంటి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏమిటి ? ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతున్నాయి. అనే విషయాలను తెలుసుకుందాం.
విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ క్రైమ్ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీకి సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఆధ్వర్యంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, ఎల్‌కె అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్‌కుమార్, అనంత తంబిరాజా ప్రధాన పాత్రలు పోషించారు. సిరై 2025 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇది ఎస్కార్ట్ డ్యూటీ తో ఒక యువకుడిని కోర్టుకు తీసుకెళ్ళే ఒక పోలీసు చుట్టూ తిరుగుతుంది. ZEE5లో January 23 నుంచి ఇది స్ట్రీమింగ్ కాబోతోంది.
దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ హైపర్ లింక్ చిత్రం హాట్ స్పాట్ కి సీక్వెల్ గా వస్తున్న సినిమా హాట్ స్పాట్ 2. ఈ సీక్వెల్ లో పెద్ద తారాగణం నటించనుంది. నటులు ప్రియా భవానీ శంకర్, ఎంఎస్ బాస్కర్, తంబి రామయ్య, రక్షన్, అశ్విన్ కుమార్, ఆదిత్య బాస్కర్, భవానీ శ్రీ, బ్రిగిదా సాగా, సంజన తివారీ ఈ సినిమాలో నటించారు. ఇది థియేటర్స్ లో January 23న విడుదల కానుంది.
శోభిత ధూళిపాల నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో క్రైమ్ రిపోర్టర్ గా శోభిత నటిస్తోంది. శరణ్ కోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమణి శ్రీనివాస్ నటించారు. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తమిళ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం విజేతను కూడా ప్రకటించనున్నారు. ఈ షోను విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అరోరా సింక్లెయిర్, విక్కల్స్ విక్రమ్, శబరినాథన్, దివ్య గణేష్ అనే నలుగురు ఫైనలిస్టులు షో లో ఉన్నారు. రాబోయే ఎపిసోడ్‌లలో విజేత రూ. 50 లక్షలు అందుకుంటాడు. JioHostar జనవరి 18న విన్నర్ ని ప్రకటిస్తారు.
Read Also : అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్