E-Paper
Advertisement

Thriller movie OTT : అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్

Thriller movie OTT : అందమైన అమ్మాయిపై పోలీస్ కన్ను… కట్ చేస్తే హత్య కేసులో దుమ్ములేపే ఇన్వెస్టిగేషన్
Advertisement

Thriller movie OTT : ఏ భాషలో చూసుకున్నా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. ఇంటెన్స్ స్టోరీలతో ఆడియన్స్ ని చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి ఈ సినిమాలు, సిరీస్లు. ఓటీటీలలో ఇవే ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ పెద్ద హిట్ కాకపోయినా, ఇంటెన్స్ కథతో సాగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్ కేసు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఊహించని మలుపులతో క్లైమాక్స్ లో అసలు హంతకుడు ఎవరో తేలుతుంది. ఈ కన్నడ సినిమా పేరు ఏంటి ?ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

అశోక్ తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘యధా యధా హి’ (Yadayadahi). ఇది 2023జూన్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ తో ఇది నడిచింది. గైస్ & డాల్స్ క్రియేషన్స్ పతాకంపై రాజేష్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దిగంత్ మంచాలే, వశిష్ట ఎన్. సింహ, హరిప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, అవినాష్, స్వాతి, మంజు పావగడ సహాయక పాత్రల్లో నటించారు. Sun NXT, prime Video లో ఇది అందుబాటులో ఉంది. ఇది 2019లో విడుదలైన అడవి శేష్ ‘ఎవరు’ (Evaru) చిత్రానికి అధికారిక రీమేక్. ఇయండిబిల్ దీనికి 7.1/10 రేటింగ్ అయితే ఉంది.

Advertisement

Read Also : కొడుకు ప్రియురాలిపై కన్నేసే తండ్రి… మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ప్రియాంక శెట్టి (హరిప్రియ) అనే ఒక రిచ్ మహిళ, పోలీస్ ఆఫీసర్ ఆదిత్య వర్మ (వశిష్ట సింహ)ను కాల్చి చంపుతుంది. అతను తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడని, ఆత్మరక్షణ కోసమే తాను చంపాల్సి వచ్చిందని ఆమె వాదిస్తుంది. ఈ కేసు విచారణ కోసం సబ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తేజ (దిగంత్ మంచాలే) రంగంలోకి దిగుతాడు. అతను ఒక అవినీతి అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, చాలా తెలివైనవాడు. ప్రియాంకను జైలు నుండి తప్పించడానికి అశోక్ తేజ ఆమెకు సహాయం చేస్తానని నమ్మిస్తాడు.

Advertisement

ఇక కథలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. విచారణ సాగుతున్న కొద్దీ ప్రియాంక, ఆదిత్య వర్మల మధ్య ఉన్న పాత సంబంధాలు బయటపడతాయి. అసలు వీరిద్దరూ కాలేజీ నుండే ఒకరికొకరు తెలుసునని, ఈ హత్య వెనుక అసలు రహస్యం వేరే ఉందని అశోక్ తేజ తన తెలివితేటలతో కనిపెడతాడు. చివరకు ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతూ క్లైమాక్స్ లో అసలు నిందితుడు ఎవరనేది బయటపడుతుంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×