E-Paper
Advertisement

Lawho Gouranger Naam Rey OTT : ఓటీటీలోకి బెంగాలీ పీరియాడికల్ డ్రామా… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Lawho Gouranger Naam Rey OTT : ఓటీటీలోకి బెంగాలీ పీరియాడికల్ డ్రామా…  ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Lawho Gouranger Naam Rey OTT : బెంగాల్‌ ఇండస్ట్రీ నుంచి ఒక భక్తిరస చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆధ్యాత్మిక గురువు శ్రీ చైతన్య మహాప్రభు జీవితం ఆధారంగా ఈ హిస్టారికల్ మూవీ తెరకెక్కింది. 1486లో పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఈయన అసలు పేరు విశ్వంభరుడు. చిన్నప్పుడు ఈయనను నిమాయి అని కూడా పిలిచేవారు. ఈయన శరీరం బంగారంలా మెరిసిపోయేది, అందుకే ఈయనకు గౌరాంగుడు అనే పేరు కూడా వచ్చింది. ఇవాళ ప్రపంచమంతా మారుమోగుతున్న “హరే కృష్ణ హరే రామ” సంకీర్తనను ఇంటింటికీ తీసుకెళ్లి, భక్తి మార్గాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది ఈయనే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.

హోయిచోయ్ (Hoichoi) ఓటీటీలో స్ట్రీమింగ్

ఆధ్యాత్మిక గురువు శ్రీ చైతన్య మహాప్రభు జీవితం ఆధారంగా రూపొందింన ఈ బెంగాలీ సినిమా పేరు ‘లాహో గౌరేంజర్ నామ్ రే’ (Lawho Gouranger Naam Rey). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య జ్యోతి దత్తా, సుభాశ్రీ గంగూలీ, జిషు సేన్‌గుప్తా, దర్శన్ బానిక్, బ్రత్యా బసు, ఇంద్రనీల్ సేన్‌గుప్తా వంటి నటులు నటించారు. ఇంద్రాదీప్ దాస్‌గుప్తా సంగీతం అందించగా, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ వంటి ప్రముఖ గాయకులు ఈ సినిమాలో పాటలు పాడారు. ‘ఖౌనే గోరాచంద్ ఖౌనే కాలా’ అనే పాట ఈ సినిమాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక ఈ సినిమా మార్చి 13 నుంచి హోయిచోయ్ (Hoichoi) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మూడు టైమ్ లైన్స్ లో ఈ సినిమా ఉంటుంది. మొదటగా 500 ఏళ్ల కిందట చైతన్య మహాప్రభు కథ చూపిస్తారు. ఆయన తన భక్తితో అందరినీ ఎలా మార్చేశాడు.. అసలు ఆయన చివరికి ఏమైపోయాడు? గాల్లో కలిసిపోయాడా ? ఎవరైనా ఏమైనా చేశారా? అనే ఆ సస్పెన్స్ మిస్టరీని ఈ సినిమాలో పక్కాగా చూపించారు.

ఇక రెండోది 19 శతాబ్ధంలో జరుగుతుంది. గిరీష్ చంద్ర ఘోష్ అనే డైరెక్టర్, బినోదిని అనే నటి కలిసి చైతన్యుడి మీద నాటకాలు వేసేవాళ్లు. అప్పట్లో ఒక మహిళ స్టేజి మీదకు వచ్చి నటించడమే పెద్ద సాహసం. ఆ బినోదిని చైతన్యుడి వేషం వేసి, ఆ దేవుడి భక్తిలో ఆమె ఎలా మునిగిపోయింది.. ఆ నాటకాల వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి అనేది ఈ పార్టులో కనిపిస్తుంది.

Advertisement

ఇక మూడవది ప్రస్తుత కాలానికి (21వ శతాబ్దం) చెందింది. ఇందులో చైతన్యుడి మీద సినిమా తీయాలని ఒక లేడీ డైరెక్టర్ తెగ ఆరాటపడుతుంది. ఈ క్రమంలో ఒక కమర్షియల్ సూపర్ స్టార్ (ఇంద్రనీల్ సేన్‌గుప్త)ను మహాప్రభు పాత్ర కోసం ఎంపిక చేస్తుంది. సినిమా నిర్మాణ సమయంలో వారిద్దరి మధ్య తలెత్తే విభేదాలు, అసలు ఈ కాలంలో ఆ భక్తి కథను ఎలా తీశారు అనేది మిగతా స్టోరీ.

Read Also : మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… అడ్డంగా బుక్కయ్యే డెలివరీ బాయ్… క్లైమాక్స్ వరకు సాగే థ్రిల్లింగ్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×