E-Paper
Advertisement

T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌

T20 World Cup 2026: సంజు అదిరిపోయే ఇన్నింగ్స్‌..ఉద్యోగుల‌కు రూ.2.5 లక్షలు బోన‌స్ ఇచ్చిన కేర‌ళ వ్యాపార‌వేత్త‌
Advertisement

T20 World Cup 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026 )  విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 96 పరుగులు తేడాతో విజయం సాధించింది ఇండియా. అయితే టీమిండియా టైటిల్ గెలవడం వెనుక సంజు శాంసన్ పోరాటం కచ్చితంగా ఉంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 321 పరుగులు సాధించి అదరగొట్టాడు సంజు శాంసన్. అసలు సంజు శాంసన్ ( Sanju Samson ) లేకపోతే టీమిండియా, ఛాంపియన్ అయ్యేది కాదు. ఇది మాత్రం వాస్తవం. చివరి ఐదు మ్యాచ్లలో అవకాశం దక్కించుకొని రాణించాడు.

Also Read: T20 World Cup 2026: పేరుకే మోడీ స్టేడియం..కానీ మొత్తం దోపిడే, ఒక్క వాట‌ర్ బాటిల్ రూ.100

సంజు ఇన్నింగ్స్.. ఆ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించిన కేరళ వ్యాపారి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా సంజు శాంసన్ బ్యాటింగ్ చేసి టైటిల్ అందించాడు. అయితే సంజు అద్భుతంగా ఆడిన నేపథ్యంలో కేరళ ( Kerala businessman) రాష్ట్రానికి సంబంధించిన ఓ బట్టల వ్యాపారి నితిన్ బాబు, తన ఉద్యోగులకు ఏకంగా 2.5 లక్షలు బోనస్ ఇచ్చాడు. కొట్టాయం జిల్లా పంపాడికి చెందిన నితిన్ బాబు… బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు రెండు గార్మెంట్లు కూడా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో పెద్ద పెద్ద దుకాణాలకు దుస్తులను సప్లై చేస్తాడు. ఇతనికి సంబంధించిన రెండు స్టోర్స్ లో మొత్తం 82 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అయితే ఫైనల్ లో సంజు శాంసన్ 89 పరుగులు సాధించి ఇండియాకు టైటిల్ అందించిన నేపథ్యంలో, తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 82 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున బోనస్ అందించాడు. ఇలా మొత్తం లక్ష అరవై నాలుగు వేలు ఫైనల్ సందర్భంగా అందించాడు నితిన్ బాబు.

 

Advertisement

అంతకుముందు సూపర్ 8 దశలో వెస్టిండీస్ పై సంజు శాంసన్ 97 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా తన కంపెనీలో పనిచేస్తున్న మరో 62 మందికి 500 రూపాయల చొప్పున బోనస్ అందించాడు. ఈ 62 మంది ఉద్యోగులు మెయిన్ గార్మెంట్ లో పనిచేస్తారు. వాళ్లందరికీ మొత్తం 31,000 రూపాయలు పంచాడు. ఇక రెండో సెమీఫైనల్స్ సందర్భంగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు సంజు 89 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఫైనల్లోకి ఇండియా అడుగుపెట్టింది. ఆ సమయంలో ఒక ఉద్యోగికి వేయి రూపాయల చొప్పున మొత్తం 62000 రూపాయలు బోనస్ కింద ఇచ్చాడు. ఇలా సంజు ఆడిన ప్రతి మ్యాచ్ లో తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలా మొత్తంగా 2.5 లక్షలు ఈ వరల్డ్ కప్ సందర్భంగా 82 మంది ఉద్యోగులకు బోనస్ కింద ఇచ్చాడు నితిన్ బాబు.

Also Read: Arshdeep Singh: Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌ కు ఐసీసీ బిగ్ షాక్‌.. ముక్కు పిండి డ‌బ్బులు వ‌సూలు

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×