BigTV English

OTT Movie : డివోర్స్ ఇచ్చిన భర్త ముందే కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఆ పని… కడుపుబ్బా నవ్వించే ఈ క్రేజీ కొరియన్ డ్రామా కిరాక్ భయ్యా

OTT Movie : డివోర్స్ ఇచ్చిన భర్త ముందే కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఆ పని… కడుపుబ్బా నవ్వించే ఈ క్రేజీ కొరియన్ డ్రామా కిరాక్ భయ్యా

OTT Movie : ఓటీటీలో కొరియన్ డ్రామాలకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే కొరియన్ డ్రామాలు అనగానే సాధారణంగా వెబ్ సిరీస్ ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ మాత్రం వర్త్ వాచింగ్ మావా అని ఫీలింగ్ తెప్పిస్తుంది. పేరుకు లవ్ స్టోరీనే అయినప్పటికీ కామెడీ, ఎమోషన్స్ అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రిమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video)

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీని, ఓటిటి మూవీ లవర్స్ ఎలాంటి సబ్ స్క్రిప్షన్ అక్కర్లేకుండా ఫ్రీగానే చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్రీగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. మరో ఓటిటి మినీ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. మినీ టీవీలో వచ్చే వెబ్ సిరీస్ లు, సినిమాలన్నీ ఫ్రీగా చూడొచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లవ్ స్టోరీ కూడా ఈ ఓటీటీలోనే ఉండడం విశేషం. ఇక ఈ సినిమా పేరు ‘లవ్ మీ అగైన్‘ (Love Me Again). కొరియన్ మూవీ అయినప్పటికీ, తెలుగులో కూడా అందుబాటులో ఉంది.


స్టోరీ లోకి వెళ్తే…

మూవీ ఓపెన్ చేస్తే ఇద్దరు లవర్స్ పెళ్లి కాకుండానే డివోర్స్ తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఇద్దరకి పడకపోవడంతో ఏకంగా డివోర్స్ సెర్మని పెట్టి, తమ విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేస్తారు. ఈ వేడుకను అచ్చం పెళ్లి లాగే నిర్వహిస్తారు. దీంతో అక్కడికి వచ్చిన అతిథులు వీళ్ళు చేసే వింత చేష్టలు చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత స్టొరీ మొదలవుతుంది. హీరోయిన్ ఏదో ఒక రీసన్ తో హీరోని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది. పక్కన ఒక టైం లో హీరోయిన్ చెయ్యి విరగడంతో హీరో ఇంటికి వచ్చి వెట్టి చాకిరీ అంతా చేస్తాడు. కానీ ఆ తర్వాత ఒకరోజు హీరోయిన్ పిలవడంతో బార్ కెళ్ళి, ఆమె మనసు విరిగిపోయేలా కామెంట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ మందు కొడుతూ నది ఒడ్డున కూర్చుంటుంది. అదే టైంలో ఆమె కాలు జారి నదిలో పడిపోవడం, అక్కడే ఉన్న ఓ కుక్కల డాక్టర్ ఆమెను సేవ్ చేయడం జరుగుతుంది.

ఈ విషయం తెలిసి హీరో హడావిడిగా హాస్పిటల్ కి వెళ్లి ఏడుస్తాడు. మరోవైపు హీరో పని చేస్తున్న ఇన్నర్ వేర్ డిజైనింగ్ కంపెనీకి, ఓ డాక్టర్ నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. హీరో ఆ డాక్టర్ పని పట్టడానికి వెళ్తాడు. అయితే తీరా చూస్తే వీళ్ళిద్దరూ గతంలో ఒకే స్కూల్లో చదువుకుని ఉంటారు. ఇక్కడ ఉంటుంది అసలు ట్విస్ట్. తను సమాతో డేటింగ్ చేస్తున్నానని, చెప్పి హీరో దగ్గరే లవ్ టిప్స్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? హీరో మళ్లీ తన భార్యను దక్కించుకున్నాడా? డాక్టర్ పరిస్థితి ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. అయితే సినిమాను చూస్తునంత సేపు నవ్వుకోవడం మాత్రం పక్కా.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×