Intinti Ramayanam Today Episode February 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆఫీస్ కి వెళ్లడానికి బయలుదేరుతాడు. అవనిని పిలుస్తాడు.. లంచ్ బాక్స్ కావాలంటే పార్వతి వచ్చి నిలబడుతుంది. సారీ అమ్మా మర్చిపోయాను అనేసి అంటాడు. బాక్స్ ఇస్తే నేను ఆఫీస్ కి వెళ్ళిపోతాను అమ్మ అనేసి అనగానే లంచ్ ఇంకా అవ్వలేదు రా నేను డ్రైవర్ చేత పంపిస్తానులే నువ్వు వెళ్ళు అనేసి అంటుంది.. ఇక ఆరాధ్యను రెడీ చేసి నేను స్కూల్ దగ్గర వదిలిపెడతాను పదా అనేసి అంటాడు కమల్.. ఇక అవని ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళుతుంది.. కనకం మాత్రం నా చెయ్యి కాలిందమ్మ కాస్త వంట కూడా చేసి పెట్టి వెళ్ళండి అని డ్రామాలాడుతుంది. అవని తప్పని పరిస్థితిలో వంట చేస్తుంది. ఆ తర్వాత ఆరాధ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది.. అక్షయ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అవని మేడం మీ ఇంట్లో నుంచి గెంటేసారు అంట కదా ఎందుకు సర్ ఇలా చేశారు అవనీ మేడం చాలా మంచిది అని అందరూ అంటారు. కోపంతో అక్షయ్ అక్కడున్న వ్యక్తి కాలర్ పట్టుకుంటాడు. అంత కాదు ముందు వర్క్ గురించి చెప్పండి అని అతనికి క్షమాపణ అడుగుతాడు. ఇక అవని ఆరాధ్య కోసం పరుగులు పెడుతూ స్కూల్ దగ్గరికి వెళ్తుంది. ఇక అవని మాత్రం ఆరాధ్య కోసం వెతుక్కుంటూ స్కూల్ వరకు వెళ్తుంది అప్పటికే ఆరాధ్య స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో వాచ్మెన్ ఆమెను లోపలికి రానివ్వరు. ఇక ఆరాధ్య వచ్చేంత వరకు వెయిట్ చేస్తానని అక్కడే ఉంటుంది అవని. శ్రీకర్ అక్కడికి వస్తాడు అవనేను చూసి శ్రీకర్ ఏమైంది వదిన అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవని కోసం వెతుకుతూ ఉంటాడు. అవని నాకు ఒక్కసారి కనిపిస్తే చాలు.. నాకు చూడాలనిపిస్తుంది.. అసలు అవని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.. నన్ను ఇంట్లో వాళ్ళందరూ ముందర చెడ్డ చేసింది నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేలా చేసింది. పల్లవి చేసిన పనికి నాకు ఎంత కోపం రావాలి అని అంటుంది. కేవలం పల్లవిని భరించడానికి కారణం కమల్.. అందుకే మౌనంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లి నిజం చెబితే మీ అమ్మ తట్టుకోలేదు. అయితే పల్లవికి బుద్ధి వచ్చే పని మనం చెయ్యాలి. అప్పుడే అంతా సెట్ అవుతుంది అని అవని అంటుంది. ఇక అవినీతి శ్రీకర్ కలిసి ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. పల్లవి నోటిని వెంటనే నిజాలు చెప్పించాలని అనుకుంటారు. ఇక శ్రీయా కూడా శ్రిఖర్ కూడా అవనికి సపోర్ట్ గా నిలుస్తారు.. ఇక అవని ప్లాన్ ప్రకారం శ్రీకర్ శ్రీయళ్లిద్దరూ ఆ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. రాజేంద్రప్రసాద్ పర్మిషన్ తీసుకోవాలని రాజేంద్రప్రసాద్ వెళ్తూ ఉంటే ఆయన కారుకి అడ్డుగా వెళ్తారు అయితే పక్క నుంచి కారు బొమ్మని రాజేంద్రప్రసాద్ అంటే శ్రియ వచ్చేసి మావయ్య మీ శ్రేయోభిలాషులుగా నేను మాట్లాడుతున్నాను. మాకు అవి అక్క వెళ్లిపోవడం ఎంత బాధగా ఉందో మీకు తెలియట్లేదు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను శ్రీకర్ ప్రయత్నిస్తున్నామని అంటుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అన్న మమ్మల్ని కొద్ది రోజులు ఇంట్లో ఉన్నాను అని నాన్న అనేసి శ్రీకర్ రాజేంద్రప్రసాద్ అంటాడు. రాజేంద్రప్రసాద్ వాళ్ళిద్దరు ఇంట్లో ఉంచడానికి ఒప్పుకుంటాడు..
అవని ప్లాన్ ప్రకారం శ్రీకర్ శ్రీయా ఇద్దరూ కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికి వస్తారు. వాళ్ళ చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఈ ఆస్తి మొత్తం అనుభవించాలనుకుంటే వీళ్లేంటి లగేజ్ తో సహా ఇక్కడికి వచ్చేసారని కంగుతిని నిలబడుతుంది. భానుమతి మాత్రం సంతోషంగా ఫీల్ అవుతుంది. మనవరాలు చూసి మురిసిపోతుంది.. ఇక లోపలికి రాగానే పల్లవి మీరు ఎందుకు బావ వచ్చారు మావయ్య గారు చూస్తే బాగోదు మీరు వెళ్లిపోండి తిడతారు అనేసి అంటుంది. వెళ్లాల్సిన అవసరం మాకు లేదు మేము ఇక్కడే ఉంటామని శ్రీకర్ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక పార్వతి కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంట్లోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. రాజేంద్రప్రసాద్ కు ప్లాన్ గురించి తెలిసినట్లు ఉంది అందుకే నీ కొడుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఆ విషయాన్ని వాళ్ళ నాన్న చక్రధరికి చెప్తుంది. వాళ్ళని ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలి డైట్ లేకపోతే ఇంట్లోనే అతుక్కుపోతే ఇంటికి నేను మహారాణి అవలేను అని టెన్షన్ పడుతుంది. ఇక శ్రీకర్ పల్లవి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న స్పీకర్ పెట్టినట్లు చూపిస్తాడు. అది చూసి పల్లవి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మొత్తంగా చూసుకుంటే శ్రీకర్ పల్లవి ప్లాన్స్ ను బ్రేక్ చేస్తున్నాడు. పల్లవికి అడ్డు పడుతున్నాడని తెలుస్తుంది.. ఇక ముందు ముందు పల్లవికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..