E-Paper
Advertisement

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా
Advertisement

Lovesick OTT : 19వ శతాబ్దం చివరి రోజులు… ఒకవైపు ప్రేమ, మరోవైపు పగ… ఇంకోవైపు దేశాన్ని కుదిపేస్తున్న విప్లవం. సమాజం పెట్టిన గీతలు దాటి డాక్టర్ కావాలనుకునే ఓ యువతి జీవితంలోకి ఇద్దరు పురుషులు వస్తే ? ఒకరు విప్లవం వైపు నడిచే ప్రేమికుడు, మరొకరు శాంతిని నమ్మే వైద్యుడు. వీరిద్దరి మధ్య ఆమె ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుంది ? ప్రేమ కోసం చేసిన త్యాగాలు చివరికి ఆమె స్వేచ్ఛను దూరం చేశాయా ? మెక్సికన్ రచయిత్రి ఆంజెల్స్ మాస్ట్రెట్టా రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ పేరు ‘Lovesick’. ఈ పీరియాడిక్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మెక్సికన్ విప్లవం నేపథ్యంలో ప్రేమ, నష్టం, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజకీయ కల్లోలం కలిసిన ఈ పీరియడ్ డ్రామా మొత్తం 7 ఎపిసోడ్లతో తెరకెక్కింది. మరి ఎమిలియా సౌరి జీవితాన్ని మార్చిన ఆ ఇద్దరు ఎవరు ? ఆమె డాక్టర్ కావాలనే కలను ఎలా కాపాడుకుంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1910లో మెక్సికోలో తిరుగుబాటు వాతావరణం మొదలవుతున్న సమయంలో ఎమిలియా సౌరి తన జీవితానికి తానే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటుంది. ఆ కాలంలో మహిళలకు ఉన్న సామాజిక పరిమితులను ఎదురించి వైద్యురాలిగా ఎదగాలని ఆమె కల కంటుంది. ఇదే సమయంలో చిన్ననాటి స్నేహితుడు డేనియల్ క్యూన్కా ఆమె జీవితంలోకి తిరిగి వస్తాడు. అతను విప్లవ భావాలతో ముందుకు సాగుతున్న వ్యక్తి. మరోవైపు ప్యూబ్లాకు వచ్చిన డాక్టర్ ఆంటోనియో జవాల్జా శాంతిని నమ్మే వైద్యుడు. ఎమిలియా మనసు ఈ ఇద్దరి మధ్య చిక్కుకోవడంతో కథలో లవ్ ట్రయాంగిల్ మొదలవుతుంది.

Advertisement

దేశంలో రాజకీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఎమిలియా వ్యక్తిగత జీవితం కూడా మారిపోతుంది. డేనియల్ తీసుకునే నిర్ణయాలు ఆమె భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ప్రేమ, బాధ్యత, తన వృత్తి కల మధ్య ఎమిలియా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక దశలో ఆమె విప్లవంలో డేనియల్‌తో కలిసి ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలో ప్రేమతో పాటు త్యాగం, సేవ, యుద్ధం ఆమె జీవితంలో భాగమవుతాయి.

కానీ కథ అక్కడితో ఆగదు. ఎమిలియా కొత్త జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తుంది. అనుకోని ఓ నిజం ఆమెను మళ్లీ డేనియల్ కోసం వెతికేలా చేస్తుంది. గత ప్రేమను తిరిగి అందుకోవచ్చా ? లేక కాలం వాళ్లిద్దరినీ పూర్తిగా మార్చేసిందా ? అదే సమయంలో ఎమిలియా తన డాక్టర్ కావాలనే కలను ఎలా నెరవేర్చుకుంటుంది ? ప్రేమను, స్వేచ్ఛను, తన భవిష్యత్తును ఒకేసారి కాపాడుకోగలదా ? అనేదే సిరీస్‌లో చూడాల్సిన అసలైన ఎమోషనల్ డ్రామా.

Advertisement

Also Read : ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

కాటలినా అగ్యులర్ మాస్ట్రెట్టా దర్శకత్వం, అడాప్టేషన్, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ‘లవ్ సిక్’లో రెనాటా వాకా ఎమిలియా సౌరిగా నటించింది. జువాన్ పాబ్లో ఫ్యూయంటెస్ డేనియల్ క్యూన్కాగా, ఇవాన్ అమోజురుటియా డాక్టర్ జవాల్జాగా కనిపించారు. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ సెప్టెంబర్ 2 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో Spanishతో పాటు English, Hindi సహా పలు ఆడియో ఆప్షన్లు ఉన్నాయి. అయితే తెలుగు ఆడియో ప్రస్తుతం లిస్ట్ కాలేదు. పీరియడ్ రొమాన్స్, విప్లవ నేపథ్యం, లవ్ ట్రయాంగిల్, మహిళా స్వేచ్ఛ, ఎమోషనల్ డ్రామా వంటి వాటిని ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×