E-Paper
Advertisement

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా
Advertisement

Hollywood Comedy Movie: జేబులో డబ్బులు లేవు… అద్దె కట్టాలి… జీవితంలో ఏం చేయాలో క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కి ఏదైనా వింత గ్యాడ్జెట్ దొరికితే ? అది వాళ్ల జీవితాలను మార్చేస్తుందని అనుకుంటే, చివరికి అదే వస్తువు కోసం అందరూ వెంటపడితే ? సరదాగా మొదలైన ఓ చిన్న గందరగోళం కాస్తా సైకిక్ పవర్స్, తప్పు గుర్తింపు, గ్యాంగ్‌ల వెంటపడటం, పిచ్చి పిచ్చి సంఘటనలుగా మారితే ఎలా ఉంటుందో చూపించే స్టోనర్ కామెడీ మూవీ ‘The Wrong Girls’. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ప్రయోగాత్మక డ్రగ్స్‌తో నిండిన ఓ బ్రీఫ్‌కేస్ ఈ ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి రావడంతో అసలు రచ్చ మొదలవుతుంది. మరి ఆ బ్రీఫ్‌కేస్‌లో ఏం ఉంది ? దాని కోసం ఎవరు వాళ్ల వెంట పడుతున్నారు ? చివరికి ఈ ఇద్దరూ ఎలా బయటపడ్డారు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఫ్రాంకీ, మోలీ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. డబ్బులు పెద్దగా లేకపోయినా తమదైన స్టైల్లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అద్దె బకాయిలు, ఉద్యోగ సమస్యలు, రోజంతా చేసే అల్లరి మధ్య వాళ్ల జీవితం సాగిపోతుంటుంది. కానీ ఓ రోజు ఫ్రాంకీని మరో అమ్మాయిగా పొరబడటంతో ఆమె చేతికి అనుకోకుండా ఓ బ్రీఫ్‌కేస్ వస్తుంది. అందులో సాధారణ వస్తువులు కాకుండా ప్రయోగాత్మక డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ కారణంగా ఫ్రాంకీ, మోలీకి ఊహించని టెలిపతిక్ సామర్థ్యాలు వస్తాయి. అంతేకాదు, వాళ్ల పెంపుడు పిల్లులతో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతారు.

Advertisement

మొదట ఈ కొత్త పవర్స్‌ను సరదాగా తీసుకున్నా, ఆ బ్రీఫ్‌కేస్ కోసం కొంతమంది వెతుకుతున్నారని తెలిసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తమ చేతిలో ఉన్న డ్రగ్స్‌తో డబ్బు సంపాదించుకుని అద్దె సమస్య నుంచి బయటపడాలని ఫ్రాంకీ, మోలీ ప్రయత్నిస్తారు. కానీ వాళ్ల ప్లాన్ కాస్తా బెడిసికొట్టి, ప్రయోగాత్మక డ్రగ్స్‌ను తిరిగి దక్కించుకోవాలనుకునే వ్యక్తుల టార్గెట్‌గా మారతారు. ఇక లాస్ ఏంజెల్స్‌లో వాళ్లు ఎక్కడికి వెళ్లినా గందరగోళమే.

ఒకవైపు డబ్బు అవసరం, మరోవైపు తమను వెంబడిస్తున్న వాళ్లు, మధ్యలో కొత్తగా వచ్చిన పవర్స్‌తో ఇద్దరి స్నేహం మరింత ఫన్‌ గా మారుతుంది. అసలు ఆ డ్రగ్స్‌ ను ఎవరు తయారు చేశారు ? ఫ్రాంకీని ఎందుకు మరో అమ్మాయిగా పొరబడ్డారు ? ఈ పవర్స్‌తో ఇద్దరూ ఏం చేయబోతున్నారు ? వాళ్ల చేతికి వచ్చిన బ్రీఫ్‌ కేస్ కోసం ఇంతమంది ఎందుకు వెంటపడుతున్నారు ? చివరికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తమ సమస్యల నుంచి బయటపడతారా ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు ఫన్.

తెలుగులో అందుబాటులో ఉందా ?

Advertisement

ఈ సినిమా ఇప్పుడు Prime Videoలో రెంట్‌కు అందుబాటులో ఉంది. డైలన్ మేయర్ దర్శకత్వం వహించిన ‘ది రాంగ్ గర్ల్స్’లో క్రిస్టెన్ స్టీవర్ట్, అలియా షౌకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. సేత్ రోజెన్, కుమైల్ నంజియాని, లేకీత్ స్టాన్‌ఫీల్డ్, కేట్ మెకిన్నన్, టోనీ హేల్, జీనా డేవిస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా రన్‌టైమ్ సుమారు 1 గంట 39 నిమిషాలు. సెప్టెంబర్ 1 నుంచి Prime Videoలో డిజిటల్ గా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియో మాత్రమే ఉంది. ఫ్రెండ్‌షిప్, కామెడీ, విచిత్రమైన పవర్స్, గందరగోళం, ఫుల్ ఫన్ కావాలనుకునే వారికి ఈ సినిమా ఫ్రెండ్స్‌తో కలిసి చూసే లైట్‌హార్టెడ్ కామెడీ రైడ్ అవుతుంది. మస్ట్ వాచ్.

Read Also: భార్యాభర్తల మధ్య ఊహించని రచ్చ… నవ్విస్తూనే మతిపోగొట్టే ట్విస్టులున్న మలయాళ డ్రామా తెలుగులోనే

Related News

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

హాట్ సీన్స్… అంతకుమించిన థ్రిల్… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ ఎరోటిక్ కామెడీ డ్రామా

ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న మైండ్ బెండింగ్ సైకలాజికల్ హారర్… ఏ ఓటీటీలో ఉందంటే ?

ఆ పాత భవంతిలో ఉంటే చస్తారు… దెయ్యాల కోట వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ స్ట్రీమింగ్ తెలుగులో

కంటికి కనిపించని రాక్షస శక్తులు… అర్ధరాత్రి ఈ హారర్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే

ఆమె గుర్తొస్తే గుండెల్లో కోత… కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమ ప్రయాణం

Big Stories

Advertisement
×