E-Paper
Advertisement

నమ్మినోల్లే నట్టేట ముంచే ఘోరమైన మోసం… మత్తులో ఉన్న అమ్మాయితో… చిన్న పిల్లలు చూడకూడని సినిమా

నమ్మినోల్లే నట్టేట ముంచే ఘోరమైన మోసం… మత్తులో ఉన్న అమ్మాయితో… చిన్న పిల్లలు చూడకూడని సినిమా
Advertisement

Mystery Thriller OTT : ఓటీటీలో డార్క్ మిస్టరీ థ్రిల్లర్ తో ఒక సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది అందరూ చూసే మామూలు సినిమా కాదు, కాస్త గుండె ధైర్యం ఉండాలి. ఈ సినిమాలో లైంగిక వేధింపులకు సంబంధించిన కొన్ని సీన్లు, కొంతమందిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ఒకమ్మాయి ఎంతో రిచ్‌గా బతుకుతున్నా, పాత గతం తనని వెంటాడుతూ ఉంటుంది. తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని ఆమె ఎలా ఎదుర్కొందనే విషయాన్ని చాలా సీరియస్‌గా చూపిస్తారు ఇందులో. కాకపోతే సినిమాలో కొన్ని హింసతో కూడిన సీన్లు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇది ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కడం విశేషం.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2022లో విడుదలైన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘లక్కీయెస్ట్ గర్ల్ అలైవ్’ (Luckiest Girl Alive). జెస్సికా నోల్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రచయిత్రి జెస్సికా నోల్, తన సొంత జీవితంలో ఎదుర్కొన్న ఘోరమైన లైంగిక దాడి సంఘటన ఆధారంగానే ఈ నవలను రాసింది. మొదట ఇది మామూలు కథ అని అందరూ అనుకున్నా, తర్వాత ఆమె అది తన నిజ జీవిత అనుభవమే అని ధైర్యంగా ఒప్పుకుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అతి తక్కువ సమయంలోనే టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా మిలా కునిస్ తన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇది పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ లో ఉత్తమ మూవీ, ఉత్తమ నటి కేటగిరీలో నామినేషన్లు దక్కించుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అని ఫనెల్లి అనే ఒక అమ్మాయి న్యూయార్క్‌లో పెద్ద మ్యాగజైన్‌ ఎడిటర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఇక లైఫ్ సెటిల్ అయిపోయిన రేంజ్‌లో బిల్డప్ ఇస్తుంటుంది. ఒక రిచ్ కుర్రాడితో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. బయటికి ఎంత రాజసం ఒలకబోసినా, లోపల మాత్రం ఏదో ఒక భయం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. సరిగ్గా పెళ్లి టైమ్‌లో, ఒక పాత కేసు గురించి డాక్యుమెంటరీ తీసే వ్యక్తి వచ్చి ఆమెను పలకరిస్తాడు. దాంతో ఆమె ఇన్నేళ్లు దాచిపెట్టిన అసలు మ్యాటర్ బయట పడటం మొదలవుతుంది. కట్ చేస్తే.. పదేళ్ల క్రితం ఆమె స్కూల్‌లో ఉన్నప్పుడు జరిగిన దారుణాలు కళ్లముందు కదలాడతాయి ఇప్పుడు.

ప్లాష్‌బ్యాక్ లో ఆమె తన స్కూల్‌లో ఉండే ఒక రిచ్ కుర్రాళ్ల గ్రూపుతో కలిసి పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో ఆమె బాగా మద్యం తాగి మత్తులో ఉన్నప్పుడు, ముగ్గురు కుర్రాళ్లు ఆమెపై అఘాయిత్యం చేస్తారు. ఆ సమయంలో ఆమె పూర్తిగా స్పృహలో లేకపోవడం వల్ల వాళ్లను ఎదిరించలేకపోతుంది. ఆమె అక్కడి నుండి ప్రాణాలతో బయట పడటమే ఒక వింత. ఇలాంటి ఘోరమైన గతాన్ని దాచుకుని ఆమె ఈ స్థాయికి వస్తుంది. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు నిజం చెప్పాలా? లేక కప్పిపుచ్చి తన లగ్జరీ లైఫ్‌ని కాపాడుకోవాలా? అనే సంఘర్షణలో పడుతుంది ఆమె. చివరికి ఆమె నిజం బయట ప్రపంచానికి చెబుతుందా ? ఆమెపై అఘాయిత్యం చేసినోళ్ల బండారం బయట పడుతుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : పోలీసులకే సవాల్ విసిరిన కేసు… గుట్టు విప్పిన లేడీ డిటెక్టివ్స్… ఐయండిబిలో 8.3 రేటింగ్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×