BigTV English

OTT Movie : అమ్మాయిలతో దొంగ బాబా పాడు పనులు… అందరి ముందే నగ్నంగా ఆ పని

OTT Movie : అమ్మాయిలతో దొంగ బాబా పాడు పనులు… అందరి ముందే నగ్నంగా ఆ పని

OTT Movie  : ప్రజల మూఢనమ్మకాలను ఆసరా చేసుకొని, వారి జీవితాలతో స్వామీజీలు ఆడుకుంటూ ఉంటారు. చాలామంది స్వామీజీ లు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్వాతంత్రం రాకముందు జరుగుతుంది. ఈ స్టోరీ ఆడవాళ్ళను ఆట బొమ్మలుగా చేసుకుని, వాడుకునే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ  పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మూవీ పేరు ‘మహారాజ్’ (Maharaj). 2024 లో విడుదలైన ఒక చారిత్రక డ్రామా స్టోరీ, ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీ 1862 లో జరిగిన ప్రసిద్ధ మహారాజ్ లిబెల్ కేసును సౌరభ్ షా రాసిన నవల ఆధారంగా తీయబడింది. ఈ సినిమాలో జునైద్ ఖాన్ వెండి తెరకు పరిచయం అయ్యాడు. జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే, శర్వరి వాఘ్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ మూవీని రూపొందించారు. ఇది YRF ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా నిర్మించబడింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా స్టోరీ స్వాతంత్రం రాకముందు బొంబాయిలో జరుగుతూ ఉంటుంది. కర్సందాస్ ముల్జీ అనే సామాజిక సంస్కర్త చుట్టూ తిరుగుతుంది. కర్సందాస్ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఆలోచనాపరుడు. స్త్రీల హక్కుల కోసం, వితంతువుల పునర్వివాహం కోసం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి. అతను చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, మామయ్య ఇంట్లో పెరుగుతాడు. అతను కిషోరీ అనే అమ్మాయితో నిశ్చితార్థం కూడా  చేసుకుంటాడు. కానీ ఆమె జాదునాథ్ మహారాజ్ (JJ) అనే ఆధ్యాత్మిక గురువుకి భక్తురాలు గా ఉంటుంది. అయితే JJ అనే గురువు తన ఆధ్యాత్మిక అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ‘చరణసేవ’ పేరుతో మహిళలపై లైంగిక దాడులు చేస్తాడు. వాడుచేసే పాడుపనులకు, అతని సిబ్బంది కూడా సహకరిస్తుంటారు. ఇంతలో కిషోరీ కూడా ఈ దురాచారానికి బలైపోతుంది. దీనిని కర్సందాస్ చూసి ఆమెతో సంబంధాన్ని తెంచుకుంటాడు.

ఆ తర్వాత, కిషోరీ తన తప్పు తెలుసుకుని, JJ మోసాలను గుర్తిస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన తప్పు జరిగిపోతుంది. ఆమె కర్సందాస్‌ను తన జీవితం నుంచి కోల్పోతుంది. ఈ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. చనిపోయే ముందు, కర్సందాస్‌కు JJ నిజ స్వరూపాన్ని బయటపెట్టమని కోరుతుంది. కర్సందాస్ ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు పత్రికల్లో వ్యాసాలు రాస్తాడు. JJ దుష్ప్రచారాన్ని బయట పెడుతుంటాడు. దీనితో JJ అతనిపై కేసు దాఖలు చేస్తాడు. కోర్టు విచారణలో కర్సందాస్ తన వాదనను ధైర్యంగా వినిపిస్తాడు. ఇద్దరి వాదనలు కోర్ట్ లో ఉత్కంఠంగా సాగుతాయి. చివరికి కర్సందాస్ జాదునాథ్ మహారాజ్ (JJ) ని అడ్డుకుంటాడా ? ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×