Gundeninda GudiGantalu Today episode April 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి వాళ్ళ మామయ్య కోసం ప్రభావతి టెన్షన్ పడుతూ హడావిడి చేస్తుంది. అంతలోకే ఓ వ్యక్తి కాపాడండి అంటూ వచ్చి ఇంట్లోనే కుడితి తోట్టలో పడిపోతాడు. అతనే మలేషియా మావయ్యని రోహిణి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అయ్యాయో ఇలా పడిపోయారేంటి? మీరు ఇలా కారులో కాకుండా కాలినడకని ఎందుకు వచ్చారు అని ప్రభావతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నాకు ఊరన్న సీనరీ అన్న చాలా ఇష్టం కారిని అక్కడే పంపించేసి అక్కడినుంచి నడుచుకుంటూ వచ్చేసానని మాణిక్యం అంటాడు. మాణిక్యం తెచ్చిన బట్టలు అలాగే బ్రేస్లెట్ ని బయటపడతాడు. అది చూసిన ప్రభావతి సంతోషంతో ఉబ్బిపోతుంది. ఇక బాలు అక్కడికి వచ్చి ఏం తెచ్చాడు ఒక బ్రెస్లెట్ బట్టలే కదా దానికి ఇంత ఫీల్ అవ్వాలి అని అంటాడు.. వీళ్ళ నాన్నగారు చాలానే తీసుకెళ్ళమన్నాడు నాకే అంత ఓపిక లేక ఇది తీసుకొచ్చాను ఈసారి వచ్చేటప్పుడు అవి కూడా తీసుకొస్తాను మా పాప సంతోషమే మా సంతోషం అంటాడు. కానీ బాలు మాత్రం సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి మరిది గారు అని ప్రభావతి అంటుంది. సుశీల వంట పని చేయాలి కదా ఇక పదండి ఎవరి పనులు చేసుకోవాలని అంటుంది. శృతి నేను ఈ వంటలు కట్ చేయలేకున్నానా ? నన్ను పంపించొచ్చు కదా నిద్రపోతాను అంటే.. ఆడపిల్లలు మధ్యాహ్న నిద్రపోకూడదు ఇంటికి దరిద్రం అని సుశీల పెద్ద క్లాసు వీడుతుంది.. ఇక మీనా వంటలకి నేను హెల్ప్ చేస్తాను అంటే నువ్వు ఏమి చేయొద్దు నీ పని నువ్వు చూసుకో అనేసి అంటుంది. ఇక మీనా అమ్మమ్మ గారు మీకు కాఫీ టీ ఏమైనా ఇవ్వమంటారా అని అడుగుతుంది. నాకు ఏది వద్దు ఏదైనా కావాలంటే నా కోడలు నాకు తెచ్చేస్తుందిలే అని సుశీల అంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఇంకా కట్ చేయడం అవ్వలేదా ప్రభ అని అడుగుతాడు. సుశీల మాత్రం నీ స్నేహితులతో మాట్లాడటం అయిపోయిందా? అందరిని కలిసావా అనేసి అడుగుతుంది. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను జ్ఞాపకం వస్తుంటే నా ఫ్రెండ్స్ తో చాలా సరదాగా మాట్లాడుకున్నాము సరదాగా గడిపాను అని సంతోషంగా ఉంటాడు సత్యం. ప్రభ నేనేమైనా నీకు హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు. పనికి ప్రభ కొబ్బరి తురిమి ఇవ్వండి అనేసి అడుగుతుంది. చంద్రిని కొబ్బరి ఆయనకిస్తావని అడుగుతుంది.
రవి నేను కూరగాయలు కట్ చేసేస్తాను అని అంటే సుశీల నీ పని చూసుకోరా వాళ్ళు చేస్తారులే గాని, ఎప్పుడు నువ్వు అదే పని చేస్తావుగా ఇప్పుడేం అవసరం లేదులే వాళ్ళు చేస్తారులే అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాణిక్యం ఇలా కట్ చేస్తే ఇంక మన వంటలు అయ్యేది సాయంత్రానికి అని సరదాగా అందరితో మాట్లాడుతూ లేవని నేను కట్ చేస్తాను అంటాడు. చకచకా కూరగాయలను మొత్తాన్ని ఐదు నిమిషాల్లో కట్ చేసి ఇస్తాడు. అది చూసిన అందరూ షాక్ అవుతారు. చెఫ్ కూడా ఇంత బాగా కట్ చేయరు..
నేను కూరగాయలు తరగడంలో చాలా స్పీడ్ అనేసి అక్కడ నోరు జారేస్తాడు. రోహిణి కూరగాయలన్ని తరిగేసారు కదా మావయ్య మీరు వేడి నీళ్లు అడిగారు కదా పెట్టిస్తాను రండి అని అంటుంది. లోపలికి వెళ్ళగానే నీ మటన్ బుద్ధి బయట పెట్టొద్దు రాజమౌళి మహేష్ బాబు బయట క్యారీ వ్యాన్ లో కూర్చొని విజువల్స్ ని చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా నేను చెప్పినట్టే చేయకుంటే మాత్రం కచ్చితంగా నేను తీసుకునే సమస్యను లేదో అని రోహిణి హెచ్చరిస్తుంది. నిద్రపోతున్నట్లు బయటకు రావద్దు నిద్రపోతున్నట్టు నటిస్తే చాలు అని అంటుంది..
ఇక తర్వాత రోజు ఉదయం అందరూ ముగ్గు పెట్టినమీనా పై ప్రశంసలు కురిపిస్తారు. ఈ పొంగల్ అవ్వగానే అందరూ గుడికి వెళ్ళాలి అని అంటారు. రోహిణి వెళ్లి వాళ్ళ మామయ్యని పిలుచుకోవాలి రోహిణి మాణిక్యంకు ముందే వార్నింగ్ ఇచ్చి మరీ తీసుకొని వస్తుంది. ఈ పండుగ రోజు అందరూ సరదాగా సెల్ఫీ తీసుకుందామని శృతి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..