Dilsukhnagar Blasts case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మంగళవారం తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో నిందితులకు చుక్కెదురు అయ్యింది. నిందితుల అప్పీల్ పిటిషన్ కొట్టివేసింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్దించింది హైకోర్టు.
ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి పైగా గాయపడ్డారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై ముద్దాయిలు హైకోర్టు తలుపు తట్టారు. ముద్దాయి పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం (ఏప్రిల్ 8) రోజు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.
స్టోరీలోకి వెళ్తే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్లలో కేసులో దిల్‌సుఖ్‌నగర్ కూడా ఒకటి. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్ సిటీలోని దిల్ సుఖ్‌నగర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. బస్‌స్టాప్, మిర్చిపాయింట్ వద్ద జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. మరో 131 మంది గాయపడ్డారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ప్రస్తుతనికి పరారీలో ఉన్నాడు. మరో ఐదుగురు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట తీర్పు ఇచ్చింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్, తహసిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
ALSO READ: తెలంగా ఆర్టీసీ జేఏసీ షాకింగ్ న్యూస్, ఆ రోజు నుంచి బస్సులు బంద్
ఎన్ఐఏ కోర్టు తీర్పుపై అప్పీల్
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తును చేపట్టింది. ఎన్నో ఆధారాలను సేకరించింది. టెక్నికల్ డేటా ఆధారంగా కీలక నిందితులను గుర్తించాయి దర్యాప్తు టీమ్‌లు. మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. వారిచ్చిన వాంగ్మూలాలతో కేసు బలపడింది. దాడుల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ ప్రమేయమున్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ సంస్థకు చెందిన సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడితోపాటు మరో నలుగురు ఈ దాడుల్లో భాగమైనట్టు తేలింది. చివరకు ఈ కేసు ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ అయ్యింది. నిందితులపై విచారణ ముగిసింది. 2016లో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
న్యాయస్థానం తీర్పు
యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్షవిధించింది. అయితే ఎన్ఐఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. కింది కోర్టు విధించిన తీర్పును రద్దు చేయాలని కోరారు. వీటిపై జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజులపాటు విచారణ జరిపింది. చివరకు తీర్పు వెల్లడించింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
నిందితుల అప్పీళ్లు, కింది కోర్టు తీర్పుపై న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. అయితే హైకోర్టు తీర్పులో రిలీఫ్ రాలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నది భావిస్తున్నారు నిందితుల తరపు న్యాయవాదులు.
తీహార్ జైలులో భత్కల్
ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పట్టుకునేందుకు కేంద్ర సంస్థలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. చివరకు యాసిన్ భత్కల్‌ను 2013లో బీహార్-నేపాల్ బోర్డర్‌లో అరెస్ట్ చేశారు. ఆయనపై ఢిల్లీ-2008, పుణె-2010 బాంబు పేలుళ్ల కేసుల్లో దోషిగా ఉన్నాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.