E-Paper
Advertisement

Watusi Zombie OTT : ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తడాఖా చూపిన మలయాళం జోంబీ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఫ్రీగానే

Watusi Zombie OTT : ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తడాఖా చూపిన మలయాళం జోంబీ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఫ్రీగానే
Advertisement

Watusi Zombie OTT : కొన్ని సినిమాలు ఇంటర్నేషనల్ గా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఇండియాలో మాత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తాయి. అలా బిగ్ స్క్రీన్ పై రాకపోవడానికి కారణాలు ఏమైనా సరే… ఇలాంటి చిన్న సినిమాలకు కనీసం ఓటీటీలో అయినా ఆడియన్స్ సపోర్ట్ దక్కకపోవడం బాధాకరం. తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తడాఖా చూపించిన ఓ మలయాళం మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. కానీ కనీసం ఆ మూవీ రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. మరి ఇంతకీ ఈ మూవీ పేరేంటి ? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఫ్రీగానే చూడవచ్చు

సిరిల్ అబ్రహం డెన్నిస్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘వాటుసి జోంబీ’ (Watusi Zombie). IFFKలో మొదటిసారి ప్రదర్శించిన ఒక సంవత్సరం తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ షురూ అయింది. ఈ ఇండీ చిత్రాన్ని 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బృందం రూపొందించింది. ప్రతిభావంతులైన జెన్ జెడ్ యువకుల బృందం నిర్మించిన ‘వాటుసి జోంబీ’ నూతన సంవత్సరం సందర్భంగా ఆన్‌లైన్‌ లో అరంగేట్రం చేసింది. 2024లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో ప్రీమియర్ అయిన ఈ మలయాళ చిత్రం ఇప్పుడు యూట్యూబ్‌ (Youtube)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

దాదాపు 1 గంట నిడివి గల ఈ చిత్రాన్ని యూట్యూబ్‌ లో ఇంగ్లీష్ సబ్‌టైటిళ్లతో ఉచితంగా చూడవచ్చు. ‘వాటుసి జోంబీ’ అనే టైటిల్ కు తగ్గట్టే ఈ మలయాళ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకుడు సిరిల్ అబ్రహం డెన్నిస్ రచయితగా కూడా వర్క్ చేశారు. సాధారణంగా మలయాళీ ప్రేక్షకులు చూసే చూసే సినిమల్లా కాకుండా… ఈ మూవీతో ఒక విలక్షణమైన ప్రయత్నం చేశారు. ‘వాటుసి జోంబీ’ కొత్త తరం చిత్రనిర్మాణం ట్రెండ్ ను స్టార్ట్ చేశారు. గాబ్రియేల్ పాత్రలో అబ్దుల్ అహద్ నటించగా, బెట్టీ జాకబ్ పాత్రలో వరుణ్ గోకుల్, పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా అనంత కృష్ణన్ నటిస్తున్నారు. మరో ఆసక్తికరమైన పాత్రలో శృతి వసంత్ నటించగా, సారా పాత్రలో దియా సారా సంతోష్ నటించారు. సిద్ధార్థ్ రెంగన్, సౌరవ్ సురేష్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Read Also :  పోలీసులు మాత్రమే ఉండే కొండపై ప్రత్యక్షమయ్యే డెడ్ బాడీ… ‘ఎకో’ లాంటి మిస్టరీ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కోవిడ్ మహమ్మారికి ముందు కొచ్చిలో జరిగే కథ ఇది. ‘వాటుసి జోంబీ’ చిత్రం ‘ది నాయిస్’ అనే పాడ్‌కాస్ట్ షోతో ప్రారంభమవుతుంది. ఇందులో హోస్ట్ బెట్టీ జాకబ్ రాసిన ఐదుగురు ఆసక్తికరమైన వ్యక్తుల పుస్తకం గురించి మాట్లాడుతాడు. ఈ పుస్తకంలో కూడా కనిపించే స్టాండప్ కమెడియన్ గ్రిండ్‌సెట్ గాబ్రియేల్, షో సమయంలో తన కథలను పంచుకుంటాడు. ఇక కథకు అనుగుణంగా గతం, వర్తమానంలోకి జంప్ అవుతుంటుంది. మలయాళ మూవీ లవర్స్ వెంటనే ఈ మూవీపై ఒక లుక్కేయండి.

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×