E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్… నవ్విస్తూనే వణుకు పుట్టిస్తున్న సినిమా

ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్… నవ్విస్తూనే వణుకు పుట్టిస్తున్న సినిమా
Advertisement

Psychological thriller movie on OTT : మలయాళ సినిమాలకు తెలుగులో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ థ్రిల్లర్ జానర్ కు విపరీతమైన ఆదరణ ఉంది ఇక్కడ. థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీలోనే వీటిని చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ని అలరించడానికి మరో మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళ స్టార్ హీరో కుంచకో బోబన్ హీరోగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పేరు ‘ఒరు దురూహ సాహచర్యత్తిల్’ (Oru Durooha Saahacharyathil). థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నెల రోజుల్లోనే డిజిటల్ ఆడియన్స్ ను పలకరిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే వాళ్ళు, థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లో ఈ సినిమాని ఎంచక్కా చూసేయచ్చు.

‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ 

ఏప్రిల్ 15న థియేటర్లలోలో విడుదలైన ‘ఒరు దురూహ సాహచర్యత్తిల్’ సినిమా మే 13 నుండి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ఈ రోజు నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది. దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ పొదువల్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో కుంచకో బోబన్‌తో కలిసి ‘న్నా తాన్ కేస్ కొడు’ వంటి సెటైరికల్ హిట్ ఇచ్చిన రతీష్.. ఈసారి మాత్రం డార్క్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ వైపు మొగ్గు చూపారు. ఈ చిత్రంలో కుంచకో బోబన్ తోపాటు దిలీష్ పోతన్, సాజిన్ గోపు, చిదంబరం, రాజేష్ మాధవన్, జాఫర్ ఇడుక్కి, సుధీష్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్, ఉదయ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, కుంచాకో బోబన్ కలసి ఈ సినిమాని నిర్మించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సేతు (కుంచాకో బోబన్) కేరళలోని వాయనాడ్ జిల్లా తోల్‌పెట్టి అనే చిన్న ఊరిలో ఉండే ఒక సాదాసీదా ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్త. చాలా అమాయకుడు, భయస్థుడైన సేతు… మంచానపడ్డ తన అన్నను చూసుకుంటూ, రేడియో వింటూ ఎవరి జోలికీ వెళ్లకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్న ఒక మావోయిస్ట్ బలవంతంగా సేతు ఇంట్లోకి చొరబడతాడు. దాంతో ఒక్కసారిగా సేతు ప్రశాంతమైన జీవితం తలకిందులైపోతుంది. మరోవైపు అదే ఊరిలో ఒక పోలీస్ ఆఫీసర్ తన తుపాకీ పోగొట్టుకుని, అది ఎక్కడ ఆ మావోయిస్టుల చేతికి చిక్కుతుందోనని కంగారుగా వెతుకుతుంటాడు. ఈ రెండు కథలు సమాంతరంగా సాగుతూ కథని పీక్స్ కి తీసుకెళ్తాయి. భయంకరమైన నక్సలైట్ సమస్యల మధ్యలో ఒక సామాన్య విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథ… చివరికి ఎలాంటి మలుపులు తిరిగింది ? సేతు ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు ? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కోర్ట్‌ రూమ్ క్రైమ్ థ్రిల్లర్… క్లైమాక్స్‌ కోసం ఈ సినిమా చూడాల్సిందే

Tags

Related News

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

Big Stories

Advertisement
×