E-Paper
Advertisement

మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కోర్ట్‌ రూమ్ క్రైమ్ థ్రిల్లర్… క్లైమాక్స్‌ కోసం ఈ సినిమా చూడాల్సిందే

మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కోర్ట్‌ రూమ్ క్రైమ్ థ్రిల్లర్… క్లైమాక్స్‌ కోసం ఈ సినిమా చూడాల్సిందే
Advertisement

Court Room Thriller on OTT: ఆ యువకుడి చేతులు వణుకుతుంటాయి. మాటలు తడబడుతుంటాయి. కళ్లలో అమాయకత్వం కనిపిస్తుంది. కానీ అదే వ్యక్తి గురించి ఒక్కో నిజం బయటపడే కొద్దీ మొత్తం కేసే మారిపోతుంది. నమ్మిన వాళ్లకే షాక్ ఇచ్చే మలుపులతో ముందుకు సాగే సైకాలజికల్ థ్రిల్లర్ కథే ప్రైమల్‌ ఫియర్ (Primal Fear). కోర్ట్ డ్రామాలా కనిపించే ఈ సినిమా మనిషి మనసు ఎంత ప్రమాదకరంగా మారుతుందో కళ్లకు కడుతుంది.

ఎక్కడ చూడాలి?

1996లో విడుదలైన ఈ హాలీవుడ్ సైకాలజికల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. గ్రెగరీ హాబ్లిట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రిచర్డ్ గేర్, ఎడ్వర్డ్ నార్టన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఎడ్వర్డ్ నార్టన్ నటన ఈ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచింది. కోర్ట్ సన్నివేశాలు, విచారణ తీరును చాలా సహజంగా చూపించారు. కథ నెమ్మదిగా మొదలైనా, క్రమంగా ఉత్కంఠను పెంచుకుంటూ చివరికి సూపర్బ్‌గా ముగుస్తుంది.

స్టోరీ ఏంటంటే?

Advertisement

ఒక ప్రముఖ ఆర్చ్ బిషప్‌ను దారుణంగా హత్య చేస్తారు. ఈ కేసులో ఆరోన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఘటన జరిగిన చోటు దగ్గరే అతను కనిపించడం కారణంగా అందరి అనుమానం అతనిపైనే పడుతుంది. కానీ అతని ప్రవర్తన చూస్తే మాత్రం హత్య చేసిన వ్యక్తిలా అనిపించదు. ఎక్కువడా భయపడుతుంటాడు..మాటలు కూడా తడబడుతుంటాయి. దీంతో చాలా మంది అతను అమాయకుడని నమ్ముతారు. ఇదే సమయంలో ఈ కేసును ప్రముఖ న్యాయవాది మార్టిన్ తీసుకుంటాడు. మీడియా దృష్టిని ఆకర్షించే కేసులు తీసుకోవడంలో అతను చాలా ఫేమస్. మొదట ఈ కేసు కూడా అతనికి సాధారణంగానే అనిపిస్తుంది కానీ.. ఆరోన్‌తో మాట్లాడిన తర్వాత అతనిలో ఏదో అసాధారణ విషయం ఉందని గమనిస్తాడు.

కేసు ముందుకు సాగుతున్న కొద్దీ ఆర్చ్ బిషప్ జీవితం గురించి షాకింగ్ విషయాలు బయటపడుతుంటాయి. అదే సమయంలో ఆరోన్ ప్రవర్తన కూడా మారడం ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో అతను పూర్తిగా వేరే వ్యక్తిలా కనిపిస్తాడు. దీంతో కేసు మరింత ఉత్కంఠను రేపుతుంది. కోర్టులో జరిగే వాదనలు, సాక్ష్యాలు కథను కొత్త ట్విస్ట్‌ల వైపు తీసుకెళ్తాయి. నిజంగా హత్య చేసింది ఎవరు? ఆరోన్ నిజంగానే మానసిక సమస్యతో బాధపడుతున్నాడా? లేదా అందరినీ నమ్మించే ఆట ఆడుతున్నాడా అనే సందేహాలు పెరుగుతాయి. చివరికి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మొత్తం స్టోరీని ఒక్కసారిగా మార్చేస్తుంది. చివరి కొన్ని నిమిషాలు ప్రేక్షకుడిని పూర్తిగా షాక్‌కు గురిచేస్తాయి. ఇక ఎండింగ్‌ చూసిన తర్వాత ఈ కథ ఎందుకంత స్పెషలో అందరికీ క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.

Advertisement

Read Also : మెదడు మొద్దుబారేలా చేసే తెలుగు హార్రర్ థ్రిల్లర్.. సింగిల్ గా చూశారో ఫసక్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×