E-Paper
Advertisement

Marathi films on ott : ఓటీటీలో ఉన్న మతిపోగొట్టే మరాఠీ సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

Marathi films on ott : ఓటీటీలో ఉన్న మతిపోగొట్టే మరాఠీ సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Marathi films on ott : ఓటీటీలో మతిపోగొట్టే మరాఠీ సినిమాలు స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ఇవి చూస్తే మనసు మాత్రం గందరగోళంగా మారిపోతుంది. ఊహించని ట్విస్ట్‌లు, ఎమోషన్స్, మైండ్ బెండింగ్ స్టోరీలతో ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రియలిస్టిక్ కథలతో ఈ సినిమాలు బాలీవుడ్ ని కూడా తలదన్నేలా ఉంటాయి. వీటిలో లవ్ నుంచి క్రైమ్ వరకు… Sairat, Harishchandrachi Factory వంటి క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం టాప్ 5 మరాఠీ సినిమాలుపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. Sairat (2016)

నాగరాజ్ మంజూళే దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ స్టోరీ మతిపోగొట్టే ట్విస్ట్‌తో ఎండ్ అవుతుంది. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో కుల వివక్ష, ప్రేమ వివాహం ఈ కథ ఉంటుంది. చూసిన తర్వాత రోజుల తరబడి మనసులో తిరుగుతుంది ఈ సినిమా. రింకు రాజ్‌గురు, ఆకాష్ తోసర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ZEE5లో అందుబాటులో ఉంది.

2. Harishchandrachi Factory (2009)

Advertisement

దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందిన ఈ స్టోరీ ఇండియన్ సినిమా చరిత్రను చూపిస్తుంది. సాధారణ మనిషి ఎలా గొప్పగా మారతాడో… మతిపోగొట్టే ఇన్‌స్పిరేషన్ తో స్టోరీ ఉంటుంది. ఈ చిత్రం భారతదేశపు మొట్టమొదటి మూకీ చిత్రం “రాజా హరిశ్చంద్ర” ఎలా నిర్మించబడిందో స్ఫూర్తిదాయకంగా చూపిస్తుంది. ఇది ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.

3. Sthal (2025)

ఇది రీసెంట్ గా మరాఠీలో హిట్ అయిన సినిమా. ఇది ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. మైండ్-బెండింగ్ ఎలిమెంట్స్‌తో చూస్తుంటేనే మనసు గందరగోళంగా మారుతుంది. ఇది మతిపోగొట్టే సినిమాల లిస్ట్‌లో టాప్‌లో ఉంటుంది. గ్రామీణ మహారాష్ట్రలో పెద్దలు కుదిర్చిన వివాహాల గురించి, పురుషాధిక్యత వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఈ సినిమా స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో నందిని చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. మీరు దీన్ని ZEE5 లో చూడవచ్చు.

4. Jarann (2024)

Advertisement

మరాఠీలో సూపర్ హిట్ అయిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు ఉన్నాయి. హోలీ పౌర్ణమి రోజున ఒక గ్రామంలో మరణాలు సంభవిస్తుంటాయి. దాని సీక్రెట్ కనిపెట్టే క్రమంలో స్టోరీ ఉంటుంది. ఇందులో అమృతా సుభాష్ నటన ఆకట్టుకుంటుంది. ఇది ఇటీవలి మతిపోగొట్టే మరాఠీ సినిమాల్లో బెస్ట్. ZEE5లో అందుబాటులో ఉంది.

5. Vaalvi (2022)

ZEE5లో అందుబాటులో ఉన్న ఈ ఫిల్మ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో అనీకేత్ (స్వప్నిల్ జోషి) తన భార్య అవని (అనితా డేట్) ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు కోరుకుంటాడు. ఆమె నిరాకరించడంతో, తన ప్రియురాలితో కలిసి ఆమెను చంపడానికి ప్లాన్ వేస్తాడు.

Read Also : వాలెంటైన్స్ డేను మరింత స్పెషల్ చేసే క్రేజీ కొరియన్ రొమాంటిక్ డ్రామాలు… అస్సలు మిస్ అవ్వొద్దు

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×