E-Paper
Advertisement

గతాన్ని వెంటాడే భయం.. పడుకున్న తర్వాత కూడా నిద్ర పట్టదు..

గతాన్ని వెంటాడే భయం.. పడుకున్న తర్వాత కూడా నిద్ర పట్టదు..
Advertisement

OTT Movies: హారర్ సినిమాల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని చూసినంత సేపు భయపెడితే, మరికొన్ని సినిమా అయిపోయాక కూడా మనల్ని వెంటాడుతాయి. హాలీవుడ్ నటి క్రిస్టినా రిక్కీ ప్రధాన పాత్రలో నటించిన ‘మోన్‌స్ట్రస్’ రెండవ కోవకు చెందిన సినిమా. ఒక పక్క వేధింపులకు గురిచేసే భర్త, మరోపక్క కంటికి కనిపించని భయంకరమైన రాక్షసుడు.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఒక తల్లి ఆవేదనే ఈ చిత్రం.

Read also-కాజల్ తో రొమాన్స్ చేసే అవకాశం మిస్ చేసుకున్న అడివి శేష్!

కథలోకి వెళ్తే..

Advertisement

1950వ దశకం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. లారా (క్రిస్టినా రిక్కీ) తన ఏడేళ్ల కుమారుడు కోడిని తీసుకుని, తన క్రూరమైన భర్త నుండి తప్పించుకోవడానికి కాలిఫోర్నియాలోని ఒక మారుమూల ప్రాంతానికి వస్తుంది. అక్కడ ఒక పెద్ద సరస్సు పక్కన ఉన్న పాతకాలపు ఫామ్‌హౌస్‌లో అద్దెకు దిగుతుంది. కొత్త వాతావరణంలో తన కొడుకుతో కలిసి సంతోషంగా గడపాలని ఆమె భావిస్తుంది.అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవదు. ఆ ఇంటి పక్కనే ఉన్న సరస్సు నుండి రాత్రి పూట ఒక వింతైన ఆకారం బయటకు వస్తున్నట్లు కోడి గమనిస్తాడు. మొదట అది పిల్లవాడి ఊహ అని లారా కొట్టిపారేసినా, క్రమంగా ఆమెకు కూడా వింత అనుభవాలు ఎదురవుతాయి. తన గతం నుండి పారిపోయి వచ్చిన లారాకు, ఈ కొత్త చోట ఎదురవుతున్న రాక్షసుడు ఎవరు? ఆ భయంకరమైన నీటి రాక్షసుడి నుండి లారా తన కొడుకుని ఎలా కాపాడుకుంది? అనేదే మిగిలిన కథ.

సినిమా ప్రత్యేకతలు

క్రిస్టినా రిక్కీ నటన: లారా పాత్రలో క్రిస్టినా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఒక పక్క గతం తాలూకు గాయాలు, మరోపక్క కొడుకు క్షేమం కోసం పడే తపనను ఆమె కళ్లలోనే చూపించింది. ఇది కేవలం మామూలు హారర్ సినిమా కాదు. మనిషి మెదడులోని భయం, డిప్రెషన్ మరియు ట్రామా ఎలా మనిషిని దెబ్బతీస్తాయో ఈ సినిమాలో లోతుగా చూపించారు. 1950ల నాటి వాతావరణాన్ని చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపిస్తూనే, లోపల ఒక తెలియని భయాన్ని నింపడంలో సినిమాటోగ్రఫీ సక్సెస్ అయింది.

Advertisement

Read also-Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ధీరజ్.. నిజం చెప్పిన చందు..కుప్పకూలిపోయిన సేనా..

సాధారణంగా హారర్ సినిమాలు అంటే దెయ్యాలు, కేకలు ఉంటాయి అనుకుంటాం. కానీ ‘మోన్‌స్ట్రస్’ మనల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా చివరలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేయడమే కాకుండా, సినిమా అంతా మనం చూసింది ఒకటైతే, అసలు నిజం ఇంకోటి అని అర్థమయ్యేలా చేస్తుంది. విభిన్నమైన కథాంశంతో సాగే సైకలాజికల్ హారర్ సినిమాలను ఇష్టపడితే, ఈ వీకెండ్‌లో ‘మోన్‌స్ట్రస్’ ఒక మంచి ఛాయిస్. ఇది కేవలం భయపెట్టడమే కాదు, మాతృత్వంలోని గొప్పతనాన్ని మానసిక ధైర్యాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×