E-Paper
Advertisement

OTT Movie : 2025లో OTTలో అత్యధికంగా వీక్షించిన టాప్ 5 సిరీస్‌లు ఇవే… అన్నీ చూసేశారా ?

OTT Movie : 2025లో OTTలో అత్యధికంగా వీక్షించిన టాప్ 5 సిరీస్‌లు ఇవే… అన్నీ చూసేశారా ?

OTT Movie : ఈ సంవత్సరం బాక్సాఫీస్ లో సూపర్ హిట్ సినిమాలతో పాటు, సూపర్ ఫ్లాప్ లు కూడా వచ్చాయి. చావా, సయ్యారా వంటి సినిమాలు ఆధిపత్యం చెలాయించగా, దే దే ప్యార్ దే 2, కేసరి 2 వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలు, ఈ సారి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. అయితే 2025 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లకు మంచి సంవత్సరం అని చెప్పుకోవాలి. ‘క్రిమినల్ జస్టిస్ 4’ ‘పంచాయత్ 4’తో సహా అనేక సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో విడుదలయ్యాయి. వీటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ వ్యూస్ తో ఇప్పటికీ అదరగొడుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుండి నవంబర్ వరకు అత్యధికంగా వీక్షించబడిన 5 సిరీస్‌లు ఇవే.

‘క్రిమినల్ జస్టిస్ 4’

పంకజ్ త్రిపాఠి నటించిన ఈ వెబ్ సిరీస్, ఈ ఏడాది జూలై 3న జియో హాట్‌స్టార్‌లో నాల్గవ సీజన్‌తో తిరిగి వచ్చింది. అతను సుర్వీన్ చావ్లా మహమ్మద్ జీషన్ అయూబ్‌లతో కలిసి కోర్ట్‌రూమ్ డ్రామాని పీక్స్ లో నడిపించాడు. ఇందులో ఆశా నేగి కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక వ్యూస్ పొందింది. మింట్ నివేదిక ప్రకారం ‘క్రిమినల్ జస్టిస్ సీజన్ 4’ని 27.7 మిలియన్ల మంది వీక్షించారు.

‘ఆశ్రమం సీజన్ 3’

‘యానిమల్’ సినిమాతో బిగ్ స్క్రీన్ బాద్షా అనిపించుకున్నాడు బాబీ డియోల్. MX ప్లేయర్ సిరీస్ ‘ఆశ్రమం’ లో బాబా అవతారంలో అందరినీ ఆశ్చర్య పరచాడు. ఈ సిరీస్ ఓటీటీలో 27.1 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఇది 2025 సంవత్సరంలో అత్యధికంగా వీక్షించబడిన రెండవ షోగా నిలిచింది.

‘పంచాయితీ సీజన్ 4’

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత విజయవంతమైన సిరీస్‌లలో ‘పంచాయత్’ ఒకటి. ఇది వరకు వచ్చిన మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించింది. నాల్గవ సీజన్ జూన్‌లో విడుదలై, 23.8 మిలియన్ల వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో నిలిచింది.

‘స్క్విడ్ గేమ్స్ 3’

ఈ కొరియన్ డ్రామా సిరీస్ భారతదేశంలో భారీ విజయాన్ని సాధించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రతి వారం ఒక కొత్త కొరియన్ డ్రామాను విడుదల చేస్తుంది. అయితే ప్రపంచ ప్రేక్షకులతో పాటు, భారతీయ ప్రేక్షకులు కూడా దీనికి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయారు. గత రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. అయితే స్క్విడ్ గేమ్స్ సీజన్ 3. కథాంశం కొంచెం నిరాశపరిచినప్పటికీ, ఇది ఇప్పటికీ 16.5 మిలియన్ల వ్యూస్ ని సంపాదించగలిగింది.

‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6’

జియో హాట్‌స్టార్ ఒరిజినల్ అయిన “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6” కూడా ఈ సంవత్సరంలో అత్యధిక వ్యూస్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ యానిమేటెడ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో సుమారు 16.2 మిలియన్ల వ్యూస్ సంపాదించింది.

 

Read Also : జైలు నుంచే రాబరీ స్కెచ్… ఒక్క సారి చేస్తే లైఫ్ సెట్టు… దిమాక్ కరాబయ్యే క్లైమాక్స్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×