E-Paper
Advertisement

Year Ender 2025 : కోర్టు నుండి మిరాయ్ వరకు… ఈ ఏడాది మస్ట్ వాచ్ తెలుగు సినిమాలు

Year Ender 2025 : కోర్టు నుండి మిరాయ్ వరకు… ఈ ఏడాది మస్ట్ వాచ్ తెలుగు సినిమాలు
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మిక్స్‌డ్ ఇయర్ గా మారింది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలలో కొన్ని మాత్రంఏ బ్లాక్‌బస్టర్స్ గా నిలిస్తే, కొన్ని సర్ప్రైజ్ హిట్స్ అయ్యాయి. ఇంకొన్ని డిసపాయింట్‌ చేశాయి. హైయెస్ట్ గ్రాసర్స్‌లో మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఉండడం విశేషం. ఈ ఏడాది బాక్స్ ఆఫీసును డామినేట్ చేసిన టాప్ తెలుగు సూపర్ హిట్స్, అవి ఏ ఓటీటీలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

1. They Call Him OG 

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 2025 సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇందులో ఓజస్ గంభీర (OG)గా, ముంబై అండర్‌ వరల్డ్‌లో రివెంజ్ తీర్చుకునే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఇమ్రాన్ హాష్మీ విలన్‌గా, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా ఇందులో కన్పించచారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్. వరల్డ్‌వైడ్ గా సుమారు 295-300 కోట్లు రాబట్టి 2025లో అత్యధిక గ్రాస్ చేసిన తెలుగు సినిమాలలో ఒకటిగా ‘ఓజీ’ నిలిచింది. Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ.

2. Sankranthiki Vasthunnam

Advertisement

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతి స్పెషల్‌గా 2025 జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. వరల్డ్‌వైడ్ గా సుమారు 255-258 కోట్లు రాబట్టి వెంకటేష్ కెరీర్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా. ZEE5లో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

3. Game Changer

శంకర్ దర్శకత్వం వహించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. ఈ ఏడాది జనవరి 10 న అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ మూవీని బ్యాడ్ లక్ పలకరించింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినా ఓపెనింగ్స్ బాగున్నాయి. వరల్డ్‌వైడ్ గా 186-208 కోట్లు రాబట్టిన ఈ సినిమా Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

4. Mirai

Advertisement

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ సూపర్‌హీరో యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ లో తేజ సజ్జా సూపర్ యోధగా, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ కీ రోల్స్ లో నటించారు. అదిరిపోయే విజువల్స్, VFX హైలైట్స్ తో ఈ సినిమా సర్ప్రైజ్ హిట్ అయ్యింది. వరల్డ్‌వైడ్ గా సుమారు 144 కోట్లు కొల్లగొట్టింది. JioHotstarలో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

5. Kubera

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సోషల్ థ్రిల్లర్ ‘కుబేరా’. జూన్ 20న రిలీజ్ అయిన ఈ మూవీలో ధనుష్ బెగ్గర్ నుంచి రిచ్ వ్యక్తిగా మారతాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, నాగార్జున మరో హీరోగా నటించాడు. 132-144 కోట్లు రాబట్టిన ఈ మూవీ Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఇక ఈ లిస్ట్ లో డాకు మహరాజ్, హిట్ 3, కన్నప్ప, కోర్టు, ఘాటి, కింగ్డం, తండేల్, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలు ఉన్నాయి.

Read Also : ఆ అడవిలోకి అడుగు పెట్టే మగాడికి ఆడ దెయ్యం ఫిదా… 2 గంటల 29 నిమిషాల ఫ్యాంటసీ థ్రిల్లర్

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×