E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ షోకు రవితేజ గెస్ట్ గా ఎన్ని సార్లు వచ్చాడో తెలుసా..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ షోకు రవితేజ గెస్ట్ గా ఎన్ని సార్లు వచ్చాడో తెలుసా..?
Advertisement

Bigg Boss 9 Telugu :  బుల్లితెర ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ ఎపిసోడ్ లో ఉత్కంఠని రేపే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాక టాప్ 3గా డిమాన్ పవన్, తనూజ, కళ్యాణ్ మిగిలారు. అందులోంచి ఒకరిని ఎలిమినేట్ చేసే భాధ్యతను మాస్ మాహారాజ రవితేజాకు అప్పగించాడు నాగార్జున. హౌస్ లోకి రవితేజ సిల్వర్ సూట్కేస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ సూట్ కేసులో ఉన్న డబ్బులు గురించి పదే పదే చెప్పి మొత్తానికి డిమాన్ పవన్ ను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చాడు.. అయితే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కి ప్రభాస్ లేదా చిరంజీవి వస్తారని గతంలో చాలా వార్తలు వినిపించాయి. కానీ బిగ్ బాస్ మాత్రం రవితేజ తో సరిపెట్టుకుంది.. ఈయన గెస్ట్ గా రావడం ఇదేమి కొత్త కాదు. గతంలో చాలాసార్లు హౌస్ లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మరి ఇప్పటివరకు ఈయన ఏ సీజన్లకు గెస్టుగా వచ్చారు అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మూడు సార్లు బిగ్ బాస్ గెస్టుగా రవితేజా..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నిన్న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా వచ్చారు. తన కొత్త సినిమా ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ ప్రమోషన్స్ కోసం హీరోయిన్లు డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ ఇద్దరితో స్టేజ్ మీదకి వెళ్లారు రవితేజ.. ఆ తర్వాత హౌస్ లో టాప్ త్రీ లో ఉన్న ముగ్గురిలో ఒకరిని బయటకు తీసుకొచ్చే బాధ్యతల్ని తీసుకున్నాడు రవితేజ. బిగ్ బాస్ చెప్పినట్లు సిల్వర్ బ్రీఫ్ కేసును హౌస్ లోకి తీసుకొని వెళ్లారు. అందులోంచి డిమాన్ పవన్ ను బయట తీసుకొచ్చాడు. రవితేజ బిగ్ బాస్ కి రావడం ఇది మొదటిసారి కాదు.. గతంలో రెండు సార్లు ఈయన గెస్ట్ గా వచ్చారు. బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ కు గెస్టుగా వచ్చారు. ‘ధమాకా’ సినిమా ప్రమోషన్ కోసం శ్రీలీలతో కలిసి వచ్చారు, ఆదిరెడ్డి ఎలిమినేషన్ టాస్క్‌లో పాల్గొన్నారు.. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ కు గెస్టుగా వచ్చారు. ఆయన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ్‌తో కలిసి వచ్చారు.. ఇప్పుడు ఈ సీజన్ కు గెస్టు గా వచ్చారు.. 9 సీజన్లలో మూడు సార్లు గెస్టుగా వచ్చారు..

Advertisement

Also Read :రన్నర్ గా తనూజ..15 వారాలకు విన్నర్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువే పారితోషికం ..?

‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ మూవీ…

కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ రవితేజ నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇది తన 76వ సినిమాగా రాబోతుంది. అమిగోస్‌ ఫేం ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రవితేజ.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి థియేటర్లలోకి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×