E-Paper
Advertisement

OTT Movie : ఆ అడవిలోకి అడుగు పెట్టే మగాడికి ఆడ దెయ్యం ఫిదా… 2 గంటల 29 నిమిషాల ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఆ అడవిలోకి అడుగు పెట్టే మగాడికి ఆడ దెయ్యం ఫిదా… 2 గంటల 29 నిమిషాల ఫ్యాంటసీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీ ప్రియులకు ఈ రోజుల్లో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి హర్రర్, థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలు. ఈ ఏడాది థియేటర్లలో హిట్ గా నిలిచి, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగు పెట్టిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీనే మన మూవీ సజెషన్. ఓటీటీలోకి అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఈ మూవీ టాప్ 10 సినిమాల జాబితాలో నంబర్ వన్‌కు చేరుకోవడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా పేరేంటి? ఏ ఓటేటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇటీవల ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన 2 గంటల 29 నిమిషాల చిత్రం ఓటీటీకి విడుదలైంది. ఆయుష్మాన్ బాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు పోషించి పేరుగాంచిన కొద్దిమంది బాలీవుడ్ స్టార్లలో ఒకరు. ఆయన ఇటీవల రష్మిక మందన్నతో కలిసి “థామ” చిత్రంలో నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన తర్వాత, ఈ చిత్రం రీసెంట్ గా ఓటీటీప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రం టాప్ 10లో నంబర్ వన్ ట్రెండింగ్ చిత్రంగా మారడమే కాదు భారతదేశంలో అత్యధికంగా వ్యూస్ కొల్లగొట్టిన ఓటీటీ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. హర్రర్-రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

Advertisement

Read Also : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… 2025లో ఓటీటీని రఫ్ఫాడించిన లేడీ ఓరియెంటెడ్ సిరీసులు సినిమాలు

కథలోకి వెళ్తే…

టీవీ రిపోర్టర్ గా పని చేసే ఆయుష్మాన్ ఖురానా ఇందులో అలోక్ అనే పాత్రను పోషించాడు. మనుషుల ప్రాణాలను కాపాడే లేడీ బేతాల్ పాత్రలో రష్మిక మందన్న (తడ్కా) కన్పిస్తుంది. తన ఫ్రెండ్ తో కలిసి ఆయన ఓ అడవిలో టీవీ ప్రోగ్రామ్ కోసం వెళతాడు. అక్కడ అలోక్ కు ప్రమాదం ఎదురు కాగా, తడ్కా కాపాడుతుంది. అలాగే ఆ అడవిలో ఉండే డేంజరస్ తెగ నుంచి కూడా కాపాడుతుంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత రష్మిక అలోక్ తో అతని ఇంట్లోకి వెళుతుంది. అలోక్ కారు ప్రమాదానికి గురైనప్పుడు కథ మలుపు తిరుగుతుంది. తడ్కా బేతాల్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సమాజంలోని అతిపెద్ద రూల్ ను బ్రేక్ చేస్తుంది. అదేంటి? ఆమె ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంది? వీరిద్దరి ప్రేమ క్లైమాక్స్ లో ఏమైంది? అనేది స్టోరీ.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×