E-Paper
Advertisement

OTT Web Series : ఫన్ కోసం 9 ఏళ్ల పాపతో 17 ఏళ్ల అమ్మాయి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సిరీస్ మావా… బెస్ట్ కొరియన్ మాస్టర్ పీస్

OTT Web Series : ఫన్ కోసం 9 ఏళ్ల పాపతో 17 ఏళ్ల అమ్మాయి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సిరీస్ మావా… బెస్ట్ కొరియన్ మాస్టర్ పీస్
Advertisement

OTT Web Series : సీను సీనుకో ట్విస్ట్ తో థ్రిల్లింగ్ మూమెంట్స్ ను చిల్ అవుతూ ఎంజాయ్ చేయాలంటే సైకో థ్రిల్లర్ సినిమాలు బెస్ట్ ఆప్షన్. అదే సిరీస్ అయితే ఇంకా బెటర్. లాంగ్ వీకెండ్ లేదా వీకెండ్ కు ఇంట్లోనే రోజంతా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా అలాంటి సినిమా లేదా సిరీస్ గురించి వెతుకుతుంటే ఈ ఓటీటీ సజెషన్ మీ కోసమే. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ కొల్లగొట్టిన బెస్ట్ కొరియన్ మాస్టర్ పీస్ ఇది. ఒక్కసారి చూస్తే వదిలి పెట్టరు భయ్యా. చూడడం స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యేదాకా టీవీ ముందు నుంచి కదలరు. మరి ఇంతటి బ్లాక్ బస్టర్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? ఈ సిరీస్ లో అంతగా ఏముందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మూవీ కాదు, 20 ఎపిసోడ్ల K-డ్రామా సిరీస్ Mouse Web Series. 2021లో రిలీజ్ అయిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ లో మైండ్-బెండింగ్ ట్విస్టులు ఉంటాయి. IMDb రేటింగ్ 8.7 ఉందంటేనే ఈ సిరీస్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ కు చోయ్ జూన్-బే (Choi Joon-bae), కాంగ్ చియోల్-వూ (Kang Cheol-woo) దర్శకత్వం వహించారు. లీ సంగ్-గి (Lee Seung-gi) – జంగ్ బా-ర్యూమ్ (రూకీ పోలీస్ ఆఫీసర్, మెయిన్ లీడ్), లీ హీ-జూన్ (Lee Hee-joon) – గో మూ-చి (డిటెక్టివ్), పార్క్ జూ-హ్యూన్ (Park Ju-hyun), క్యూంగ్ సూ-జిన్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. Amazon Prime Videoలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

సైకోపాత్ సీరియల్ కిల్లర్‌ను వేటాడే ఇద్దరు పోలీసుల కథే ఈ సిరీస్. స్టోరీ మొత్తం సైకోపాత్స్ పుట్టుకతోనే అలా ఉంటారా? లేదంటే పరిస్థితులు వాళ్ళను అలా మారుస్తాయా? అనే లైన్ చుట్టూ తిరుగుతుంది. మంచి – చెడు, జెనెటిక్స్ – ఎన్విరాన్‌మెంట్, సైకోలను గర్భంలోనే గుర్తించి చంపొచ్చా? అనేవి మెయిన్ థీమ్స్. “హెడ్ హంటర్” అనే సీరియల్ కిల్లర్ వరుస హత్యలు చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తాడు. బాడీస్ తలలు నరికేసి పడేస్తాడు. పోలీస్ ఆఫీసర్ జంగ్ బా-ర్యూమ్ మంచివాడు, పైగా న్యాయం కోసం పోరాడతాడు. మరోవైపు డిటెక్టివ్ గో మూ-చి చిన్నప్పుడే అతని తల్లిదండ్రులను హెడ్ హంటర్ చంపేస్తాడు, అందుకే రివెంజ్ తీసుకోవడం కోసం హెడ్ హంటర్ ను వేటాడతాడు. వీళ్లిద్దరూ కలిసి కొత్త సీరియల్ కిల్లర్ “ప్రిడేటర్”ను పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వీడు 7 సిన్స్ థీమ్‌తో హత్యలు చేస్తూ ఉంటాడు. ఇక ఓ బాంగ్-యి ఒక సీరియల్ కిల్లర్ వల్ల తన అమ్మమ్మను కోల్పోతుంది. అందుకే రివేంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది.

Read Also : ఓటీటీ ప్రపంచాన్ని కుదిపేసిన సిరీస్… 34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లు, IMDbలో 6.6 రేటింగ్

Advertisement

ఈ క్రమంలోనే సుంగ్ యో-హాన్ అనే న్యూరోసర్జన్ హెడ్ హంటర్ కొడుకు అని అనుమానిస్తారు. కానీ అతను చాలా మంచివాడు, చీమకు కూడా హాని తలపెట్టడు. ఈ క్రమంలో కిల్లర్ తో జరిగిన ఫైట్ లో పోలీస్ బా-ర్యూమ్‌కు హెడ్ ఇంజురీ అవుతుంది. అదే టైమ్ లో చనిపోయిన అనుమనితుడి బ్రెయిన్ ను పోలీస్ కు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఆ తరువాతే అసలు ట్విస్ట్ బయట పడుతుంది. కిల్లర్ కొడుకుని పుట్టినప్పుడే స్వాప్ చేస్తారు. మరి ఆ హెడ్ హంటర్ ను పట్టుకున్నారా? వాడి కొడుకు ఎవరు? చనిపోయిన డాక్టర్ కి కిల్లర్ కు సంబంధం ఏంటి? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×