E-Paper
Advertisement

Best Crime Drama Series : ఓటీటీ ప్రపంచాన్ని కుదిపేసిన సిరీస్… 34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లు, IMDbలో 6.6 రేటింగ్

Best Crime Drama Series : ఓటీటీ ప్రపంచాన్ని కుదిపేసిన సిరీస్… 34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లు, IMDbలో 6.6 రేటింగ్
Advertisement

Best Crime Drama Series : ఈ రోజుల్లో ఆడియన్స్ బిగ్ స్క్రీన్ పై విడుదలైన సినిమాల కంటే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో వచ్చే వెబ్ సిరీస్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆకట్టుకునే కంటెంట్‌ ఉంటే, ఎలాంటి జానర్ అయినా ఇంట్లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని సిరీస్ లు సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వీటిలో ఒక సెన్సేషన్ కథనంతో వచ్చిన క్రైమ్ సిరీస్, ఇప్పటికే మూడు సీజన్లతో వచ్చి అద్భుతాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ నాల్గవ సీజన్‌ కి కూడా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఓ ప్రకటన కూడా ఇచ్చేసారు. దీంతో ఈ సిరీస్ అభిమానులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? దీని స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఈ సిరీస్ పేరు ఏమిటంటే

ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్ పేరు ‘ఆశ్రమ్’. ఈ సిరీస్ నాలుగవ సీజన్ షూటింగ్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభమవుతుంది. ప్రకాష్ ఝా రూపొందించిన ఈ సిరీస్ అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యధికంగా వ్యూస్ కలిగిన సిరీస్ గా గుర్తింపు తెచ్చుకుంది. MX ప్లేయర్, ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. బాబీ డియోల్ నటించిన ఈ సిరీస్, సుదీర్ఘ విరామం తర్వాత 2026లో షూటింగ్ కి రాబోతోంది. ఇందులో ఆదితి పొహంకర్ (పమ్మీ), చందన్ రాయ్ సన్యాల్ (భోపా స్వామి), దర్శన్ కుమార్ (ఉజాగర్ సింగ్) వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Read Also : థియేటర్లలో ప్లాఫ్ ఓటీటీలో హిట్… కూతురి ప్రేమకు అడ్డుపడే తండ్రి… ఎక్కడ చుడొచ్చంటే?

స్టోరీ ఏమిటంటే

ఈ సిరీస్ లో కశ్మీర్ వాలే బాబా నిరాలా రోల్‌లో బాబీ డియోల్ నటించాడు. ఒక డూప్లికేట్ గాడ్‌మ్యాన్, భక్తులను మోసం చేసి క్రిమినల్ యాక్టివిటీస్ (డ్రగ్స్, మర్డర్స్, పాలిటిక్స్, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్) చేస్తాడు. సీజన్ 1 (2020): బాబా నిరాలా ఆశ్రమ్ ఎలా బిల్డ్ అవుతుంది, లోయర్ కాస్ట్ పీపుల్‌ను ఎలా ఆకర్షిస్తాడు అనే అంశాలతో పాటు, పమ్మీ భక్తురాలిగా ఎలా అవుతుంది. సీజన్ 2: బాబా పవర్ పెరుగుతుంది, పాలిటిక్స్ లో కూడా ఎంటర్. సీజన్ 3 పార్ట్ 1(2022): బాబా తనను గాడ్‌గా డిక్లేర్ చేసుకుని ఎంపైర్ ఎక్స్‌పాండ్ చేస్తాడు, పమ్మీ తనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ ప్లాన్ చేస్తుంది. సీజన్ 3 పార్ట్ 2 (2025) కశ్మీర్ వాలే బాబా నిరాలా పతనం మొదలవుతుంది. ఈ సిరీస్ 34 ఎపిసోడ్‌లు, 3 సీజన్‌లతో IMDbలో 6.6 రేటింగ్ ని పొందింది. ప్రకాష్ ఝా డైరెక్షన్ లో బాబీ డియోల్ బోల్డ్ కంటెంట్ పర్ఫార్మెన్స్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది. మెచ్యూర్ ఆడియన్స్‌కి మాత్రమే ఇది సూట్ అవుతుంది.

Advertisement

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×