OTT Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఒక నెల తర్వాత డిజిటల్ ప్లాట్ఫారం లోకి వస్తాయన్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే మరో వారము లేదా మరో నెల తేడాతో స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి. స్టార్ హీరోలు సినిమాలైతే ముందుగానే ఓటీటీ డీల్ ను ఫిక్స్ చేసుకొని మరి థియేటర్లలోకి వస్తున్నాయి. ఎలాంటి సినిమా అయినా సరే నాలుగు వారాల తర్వాత ఓటిటిలోకి రావాల్సిందే.. కానీ ఈమధ్య సినిమాలను థియేటర్లలో చూసే వారి సంఖ్య కన్నా ఓటీటీలోనే మంచి డిమాండ్ ను సొంతం చేసుకుంటున్నాయి.. దాంతో టాలీవుడ్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓటీటీలోకి సినిమాలు ఎప్పుడు స్ట్రీమింగ్ కి వస్తాయో ఒకసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తెలుగు సినిమాల సక్సెస్ రేటు ఈ మధ్య బాగా తగ్గింది. అందుకు కారణం ఓటీటీలోకి వెంటనే కొత్త సినిమాలు రావడమే.. సినిమా థియేటర్లలో సక్సెస్ టాక్ ని అందుకున్న సరే నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ రావడంతో అక్కడ సక్సెస్ రేట్ తగ్గిపోతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమా హాళ్ళకు వసూళ్ళు బాగా తగ్గాయి… ముఖ్యంగా సింగిల్ థియేటర్స్ వారికి ఇది పెద్ద దెబ్బగా మారింది.. సింగిల్ స్క్రీన్ లలో స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రెండు మూడు రోజులు కన్నా ఎక్కువ ఆడడం లేదని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకమీదట ఏ సినిమా అయినా సరే ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా చేశారు. ఇప్పటికే ఈ విధానం ఉత్తరాదిన అమలవుతూ ఉంది… ఇకపై దక్షిణాది ఐదు రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి అమలు కానుంది. ఈ నిర్ణయంతో సినిమాలకు కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..
Also Read : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
సినిమాకు వీఎఫ్ఎక్స్ ప్రభావం ఎక్కువగా ఉంది.. సినిమాని భారీ విజువల్స్ తో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారు.. అయితే అదే సినిమా తేడా కొడితే భారీ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా సినిమా వేయాన్ని కాస్త తగ్గించాల్సిందే అని నిర్మాతల మండలిలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 60 శాతం పైగా షూటింగ్ జరుపుకున్న చిత్రాలకు ఈ ‘8 వీక్స్ సిస్టమ్’ వర్తించదు. కొత్తగా షూటింగ్ మొదలు కాబోతున్న సినిమాలకు మాత్రమే ఈ సిస్టం అమల్లో కి రానుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ఓటీటీ లోకి సినిమాలు ఒకప్పుడు నాలుగు వారాల్లోనే వచ్చేవి.. కానీ ఇప్పుడు ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి అని ఓటీటీ లవర్స్ ఫీల్ అయిపోతున్నారు.. ఇకమీదట సినిమాలు ఎంత బడ్జెట్లో తెరకెక్కుతున్నాయి అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..