BigTV English

Thriller Movie OTT : మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. అరాచకం ఈ మూవీనే..

Thriller Movie OTT : మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. అరాచకం ఈ మూవీనే..

Thriller Movie OTT : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కొత్త కంటెంట్ సినిమాలను తమ అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. ఊహకు అందని ఎన్నో ట్విస్ట్లు ఉండే మూవీలకు జనాలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే అలాంటి సినిమాల ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. థ్రిల్లర్ సస్పెన్స్ మూవీలకు ఓటీటీలో గిరాకి ఎక్కువ. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం థియేటర్లలోకి వచ్చిన సినిమాలను కూడా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. గత రెండు వారాలుగా ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని స్ట్రీమింగ్ చెయ్యనుంది. ఎలాంటి స్టోరీతో ఆ మూవీ రాబోతుందో, ఆ మూవీ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం..


ఓటీటీలోకి కొన్ని సినిమాలు ఆలస్యంగా స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తారు. ఈ ఏడాది ఆగస్టు లో థియేటర్లలోకి వచ్చిన రేవు అనే సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఐఎండీబీ లో మాత్రం ప్రేక్షకులు మంచి రేటింగే ఇచ్చారు. టైటిల్ కు తగ్గట్లే రేవు సినిమా మొత్తం మత్స్యకారుల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. నేడు చిల్డ్రన్స్ డే సందర్బంగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకొని వచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీని ఈరోజు నుంచి అందరికి అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. సడెన్ గా ప్రత్యక్షమైన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఈ థ్రిల్లర్ మూవీ స్టోరీ విషయానికొస్తే.. రేవు మూవీని హరినాథ్ పులి డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైంది. వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్ నిడదవోలు వంటి నటులు ఇందులో నటించారు. ఈ మూవీ కథ మొత్తం పలువురు మత్స్య కారుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలైన అంకాలు, గంగయ్యతో పాటు మధ్యలో వచ్చే నగేశు.. వాళ్ల మధ్య చేపల వేటలో ఉండే పోటీ.. అది వాళ్ల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులేంటి అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. రేవులో ఆ చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న కుటుంబాల జీవన విధానం గురించి చక్కగా చూపించారు. యాక్షన్‌, రివేంజ్‌తో పాటు ఓ లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు హరినాథ్ పులి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా లొకేషన్స్‌, యాక్టర్లు, విజువల్స్ అన్ని చాలా నాచురల్‌గా ఉండేలా చిత్రీకరించారు. అయితే రా అండ్ రస్టిక్ సినిమాల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ ను రేవు మెప్పిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇలాంటి సినిమాలు ఈ మధ్య పెద్దగా కనిపించలేదు. కొత్తగా చూడాలి అనుకొనేవారికి ఇది బెస్ట్ చాయిస్.. మిస్ అవ్వకుండా ఆహా లో చూసి ఎంజాయ్ చెయ్యండి..


Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×