JioPhone Prima 2 : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance jio) ఎప్పటి కప్పుడు సరికొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్లను మార్కెట్లలోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ ఫ్రెండ్లీగా 4జీ ఫోన్లను మార్కెట్లలోకి లాంఛ్ చేస్తోంది. అలా గతేడాదిలోనే జియో ఫోన్ ప్రైమా (JioPhone Prima)ను తీసుకొచ్చింది. వీటికి ఆదరణ పెరుగిన నేపథ్యంలో జియో ఫోన్ ప్రైమా2 (JioPhone Prima 2)పేరిట మరో మొబైల్‌ను కూడా లాంఛ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన ప్రైమా మొబైల్‌కు కొన్ని మెరుగులు జోడించి ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది జియో.
జియో (Reliance jio) తాజాగా సరికొత్త ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ మెుబైల్ ను లాంఛ్ చేసింది. జియో ఫోన్ ప్రైమా2 (JioPhone Prima 2)పేరిట అతి తక్కువ ధరకే బెస్ట్ మెుబైల్ ను లాంఛ్ చేసింది. ఇక ఈ ఫోన్ జియో యాప్స్‌ను సపోర్ట్ చేయడంతో యూపీఐ పేమెంట్స్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. అలానే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ను ఇది కలిగి ఉంది.
JioPhone Prima 2 Specifications :
స్పెషిఫికేషన్స్ –
ఈ జియో ఫోన్ ప్రైమా 2 ఫోన్ 320×240 2.4 అంగుళాల QVGA కర్వ్‌డ్ డిస్ ప్లే, కీ ప్యాడ్, క్వాల్‌కామ్ చిప్‌సెట్‌తో వచ్చింది. 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 జీబీ ర్యామ్‌ను సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ స్టోరేజ్ వరకు ఎక్స్‌పాండబుల్ అవుతుంది. అలానే సింగిల్ న్యానో సిమ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో స్టోరేజీని కూడా పెంచుకోవచ్చు.
ఇంకా ఈ ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ అసిస్టెంట్ వంటి ప్రముఖ యాప్‌లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి జియో యాప్స్ కూడా ఈ ఫోన్లో సపోర్ట్ చేస్తాయి.
JioPhone Prima 2 Camera : ఈ ఫోన్ లో కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ ను తీసుకువచ్చారు. ఈ బడ్జెట్ ఫోన్ 0.3 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో యూపీఐ సదుపాయంతో పాటు జియో పే యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. 23 భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేయటం మరో స్పెషల్ ఫీచర్. ఇంకా 2000mAh బ్యాటరీని అమర్చారు. ఈ మొబైల్ 15.1mm థిక్‌నెస్‌తో పాటు 3.5mm హెడ్ ఫోన్, 4G కనెక్టివిటీకి, ఎఫ్ఎమ్ రేడియోను సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ సోల్ లక్స్ బ్లూ కలర్ వేరియంట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 2,799గా నిర్ణయించారు. దీనిని అమెజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ సహా ఇతర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయొచ్చు.
రిలయన్స జియో కొద్ది రోజుల క్రితమే భారతీ మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో 4G ఫోన్స్ ను జియో భారత్ V3, V4 పేరుతో ఆవిష్కరించింది. భారత్ లో 2G వినియోగదారులకు 4G సేవలను తేలికగా అందిచాలనే ఈ ఫోన్స్ ను తీసుకొచ్చింది. ఈ మెుబైలో సైతం యూపీఐ చెల్లింపుల కోసం జియో పే, లైవ్ టీవీ, స్ట్రీమింగ్స్ అందించింది. ఇక ఈ ఫోన్ ధర కేవలం రూ. 999గా నిర్ణయించింది జియో. వీటితో పాటు ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో బెస్ట్ మెుబైల్ ను తక్కువ ధరలోనే తీసుకొచ్చింది.
ALSO READ : ఎక్కడికెళ్లినా వెంట వచ్చే వైఫై.. BSNL బంపర్ సర్వీస్ స్టార్ట్ బాస్