Nara Lokesh fires on YCP leaders : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శాసన సభను వైసీపీ బాయ్ కాట్ చేయడంతో.. మండలి వేదికగా వైసీపీ, టీడీపీ నాయకులు ఎదురుపడ్డారు. సభలో చర్చ సందర్భంగా ఓ దశలో వైసీపీ నాయకుల మాటలకు ఆగ్రహించిన లోకేష్.. తనలోని మాస్ లీడర్ ను బయటకు తీశాడు. మాటకు, మాట.. సమాధానం చెబుతూ లోకేష్ వ్యవహరించిన తీరుకు.. సభలోని వారంతా సైలేంట్ అయిపోయారు. టీవీల్లో చూసిన వారు సైతం ఆశ్చర్యపడ్డారు. ఏమైందంటే?
వైసీపీ నాయుకుల విమర్శలు, టీడీపీ నాయకుల ప్రతివిమర్శలతో టీవీ డిబెట్లే దద్దరిల్లిపోతాయి. అలాంటిది.. శాసన మండలిలో ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది? అనుకున్నట్లుగానే.. రెండు పార్టీల నాయకులు వేడివేడిగా కామెంట్లు చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనే.. ఏపీ మండలిలో జరిగింది. ప్రస్తుతం శాసన సభకు వైసీపీ నాయకులు ఎందుకు రావడం లేదంటూ మొదలైన చర్చ.. క్రమంగా హీట్ పెంచేసింది.
గతంలో చంద్రబాబు సభను వదిలి పారిపోయారంటూ వైసీపీ నాయకులు విమర్శించారు. దానికి.. మంత్రి నారా లోకేష్ మైక్ అందుకుని సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన సభకు రాకుండా చంద్రబాబు ఎప్పుడూ తప్పించుకోలేదని వివరించారు. దాదాపు రెండున్నారేళ్ల పాటు సభకు వచ్చారని.. తన తల్లిని అవమానించినప్పటి నుంచి సభను బాయ్ కాట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు..అందరూ ఒక్కటై తన తండ్రిని విమర్శిస్తున్నా.. సింహంలా ఒక్కడే నిలబడ్డాడని అన్నారు. తన తండ్రి ఎప్పుడూ సభను వదిలి మీలా పారిపోలేదు అంటూ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా తల్లిని అవమానించారు అంటూ పదేపదే చెప్పిన నారా లోకేష్.. క్రమంగా ఆగ్రహంగా మాట్లాడారు. వైసీపీ నాయకుల అప్పటి మాటల్ని గుర్తుకు తెచ్చుకుని.. ఆవేదనతో ఊగిపోయారు. “ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు” అటూ ఆగ్రహంగా ప్రశ్నిస్తూ.. చంద్రబాబును గుర్తుకు తెచ్చారు. లోకేష్ తీరును చూస్తే.. పాత చంద్రబాబు గుర్తుకు వచ్చాడని టీడీపీ శ్రేణులు అంటున్నారు.
వైసీపీ నాయకుల మాటలు గుర్తుకు తెచ్చుకుని.. ఆవేదనగా మాట్లాడుతున్న లోకేష్ ను ఆపేందుకు మండలి స్పీకర్ ప్రయత్నించారు. “నా తల్లిని అవమానించారు సర్” “నా తల్లిపై అనరాని మాటలు అన్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు తప్పుడు మాటలు మాట్లాడితే.. నన్ను మాట్లాడకుండా కూర్చోమంటారా అంటూ ప్రశ్నించారు. తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా? అంటూ తనలోని ఆగ్రహాన్ని చూపించారు.
వైసీపీ నాయకులు అందరినీ విమర్శించారని.. “నా తల్లి భువనేశ్వరినీ విమర్శించారు. వైఎస్ విజయమ్మని, షర్మిళని.. అందరినీ తిట్టారు.” ఇప్పుడు ఏం తెలియదన్నట్లు.. చంద్రబాబు సభకు రాలేదని చెబితే ఎలా అంటూ వైసీపీ నాయకులపై కౌంటర్ అటాక్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు సభను బాయ్ కాట్ చేశారో తమకు తెలుసని.. ఆరోజు తానూ సభలోనే ఉన్నానంటూ వెల్లడించారు.
Also Read : డ్రోన్లు వస్తాయి.. గంజాయి పట్టిస్తాయి.. వాహ్వా ఏం ఐడియా సార్..
లోకేష్ ఆవేశానికి..సభలోని సభ్యలు ఆశ్చర్యపోగా, వైసీపీ సభ్యులు సైతం సైలెంట్ అయిపోయారు. వాతావరణం క్రమంగా కుదుటపడగా.. అనాడు తమ సభ్యులు మాట్లాడిన మాటలను సమర్థించడం లేదంటూ.. వైసీపీ వర్గీయులు మాట్లాడారు. దాంతో.. మళ్లీ మైక్ అందుకున్న మంత్రి నారా లోకేష్.. సభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే అలాంటి వ్యక్తికి ఎందుకు టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అది సమర్థించడం కాదా అధ్యక్ష అంటూ నిలదీశారు.