E-Paper
Advertisement

పాడుబడిన ఇంట్లో ఫ్యామిలీని పాతరేసే సైకో… శవం కూడా దొరకకుండా ఎలా భయ్యా

పాడుబడిన ఇంట్లో ఫ్యామిలీని పాతరేసే సైకో… శవం కూడా దొరకకుండా ఎలా భయ్యా
Advertisement

Mudborn : ఓటీటీలోకి ఇటీవల వచ్చి భారీ సంచలనం సృష్టిస్తున్న తైవాన్ హార్రర్ చిత్రం “Mudborn” (మడ్‌బార్న్). షీ మెంగ్-జు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫోక్ హార్రర్, సైకలాజికల్ థ్రిల్లర్, వర్చువల్ రియాలిటీ ఎలిమెంట్స్‌ను కలిపి భయంకరమైన అనుభూతిని ఇస్తుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

హ్సు-చువాన్ (టోనీ యాంగ్) ఒక VR హార్రర్ గేమ్ డెవలపర్. అతని భార్య హ్సు-ము-హువా (సెసిలియా చోయ్) గర్భవతిగా ఉంటుంది. ఆమె సాంప్రదాయ వస్తువులను రిస్టోర్ చేసే పని చేస్తుంది. ఒకరోజు హ్సు-చువాన్ గేమ్ లొకేషన్ స్కానింగ్‌ కు వెళ్తాడు. అక్కడ ఒక పాత ఇంట్లో ఒక క్లే డాల్ (మట్టి బొమ్మ) కనిపిస్తుంది. ఆ బొమ్మ తల పగిలి ఉంటుంది. అతను దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు. ము-హువా ఆ బొమ్మను చూసి ఆకర్షితురాలవుతుంది. దాన్ని రిపేర్ చేయాలనే ప్రయత్నం మొదలు పెడుతుంది. కానీ ఆ బొమ్మ సాధారణ బొమ్మ కాదు. అందులో ప్రాచీనమైన దుర్మార్గమైన ఆత్మలు ఉన్నాయి. బొమ్మను రిపేర్ చేస్తున్నప్పుడు ఆమె రక్తం పడటంతో ఆ ఆత్మలు జీవం పొంది ఆమెను ఆవహిస్తాయి.

Advertisement

దీంతో ము-హువా ప్రవర్తన నెమ్మదిగా మారిపోతుంది. ఆమె శరీరం, మనసు మీద ఆత్మలు ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఆ విషయాన్ని త్వరగానే తెలుసుకుంటాడు హీరో. హ్సు-చువాన్ తన భార్యను కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. అతను ఎక్సార్సిస్ట్ అయిన అహ్-షెంగ్ (డెరెక్ చాంగ్) సహాయం తీసుకుంటాడు .కథ ముందుకు సాగుతుండగా ఆ బొమ్మ వెనుక దాగి ఉన్న భయంకర రహస్యం బయట పడుతుంది. ఆత్మలు కేవలం ఆమెను మాత్రమే కాదు, వారికి పుట్టబోయే బిడ్డను కూడా లక్ష్యంగా పెట్టుకుంటాయి. రియాలిటీ, డ్రీమ్స్, వర్చువల్ వరల్డ్‌ల మధ్య గందరగోళం మొదలవుతుంది. మరి ఇంతకీ ఆ దెయ్యాన్ని ఎలా వదిలించుకున్నారు ? ఆ దెయ్యం గతం ఏంటి ? క్లైమాక్స్ ఏంటి ? ఆ ఫ్యామిలీని దెయ్యం పెట్టిన కష్టాలు ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉంది ?

తైవాన్ ఫోక్ హార్రర్ ఎలిమెంట్స్, గర్భిణీ స్త్రీ మీద ఆత్మల ప్రభావం చూపించిన విధానం చాలా భయపెట్టేస్తుంది. VR గేమ్ డెవలపర్ జీవితం ద్వారా రియల్, అండ్ వర్చువల్ ప్రపంచాల మధ్య గందరగోళం, ట్విస్టులు, ఫైనల్ ఎండింగ్ షాక్ ఇస్తాయి. ‘మడ్ బర్న్’ మూవీ Netflixలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. సాధారణ హార్రర్ కాకుండా ఫోక్ ఎలిమెంట్స్, సైకలాజికల్ టెన్షన్, ఎమోషనల్ డెప్త్ కావాలనుకునే వాళ్లకు ఈ మూవీ బెస్ట్ ఛాయిస్. హర్రర్ మూవీ లవర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం… ఇంకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Advertisement

Read Also : వితంతు మహిళతో వింత మనిషి ప్రయాణం… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

Tags

Related News

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

Big Stories

Advertisement
×