E-Paper
Advertisement

వితంతు మహిళతో వింత మనిషి ప్రయాణం… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

వితంతు మహిళతో వింత మనిషి ప్రయాణం… హార్ట్  టచింగ్ లవ్ స్టోరీ
Advertisement

Romantic Comedy Drama on OTT : 2017లో విడుదలైన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘క్వరీబ్ క్వరీబ్ సింగల్’. ఇర్ఫాన్ ఖాన్, పార్వతి తిరువోతు నటించిన ఈ హార్ట్ టచింగ్ మూవీ కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు… 40 ఏళ్లు దాటిన వయసులో కూడా ప్రేమ ఎలా పుడుతుంది ? ఒంటరితనం ఎంత బాధిస్తుంది ? జీవితంలో రెండో అవకాశం ఎంత ముఖ్యమో చాలా అందంగా చూపించిన చిత్రం. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

జయ (పార్వతి) అనే మహిళ వితంతువు. భర్త చనిపోయి ఏడేళ్లు అవుతుంది. ఆమె ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా జీవితం గడుపుతుంది. కుటుంబం ఒత్తిడి వల్ల డేటింగ్ యాప్‌ లో తన ప్రొఫైల్ ను పెడుతుంది. అక్కడ ఆమెకు యోగి (ఇర్ఫాన్ ఖాన్)తో మ్యాచ్ అవుతుంది. యోగి చాలా ఎక్స్‌ట్రావర్ట్, మాట్లాడేందుకు ఎవరినీ వదలని, కవితలు రాసే, రైలు ప్రయాణాలు ఇష్టపడే వ్యక్తి. ఇద్దరూ మొదట ఫోన్‌ లో మాట్లాడుకుంటారు. తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ మొదటి మీటింగ్‌లోనే యోగి హైపర్ బిహేవియర్ చూసి జయకు అసహ్యం కలుగుతుంది. అయినా యోగి జయను తన గత ప్రేయసులను కలవడానికి ఒక రోడ్ ట్రిప్‌ కి ఆహ్వానిస్తాడు.

Advertisement

ఆ సమయంలో జయ ఏదో ఒక కారణంతో అతనితో వెళ్తుంది. ఢిల్లీ నుంచి లక్నో, అల్లహాబాద్, ఉదయపూర్, మౌంట్ అబూ వరకు వారి ప్రయాణం కొనసాగుతుంది. మరి ఈ ప్రయాణంలో ఏమవుతుంది? ఈ రోడ్ ట్రిప్‌ లో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, నవ్వులు, భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. యోగి గత ప్రేయసులను కలుస్తూ తన గతాన్ని జయతో పంచుకుంటాడు. జయ కూడా తన గత బాధలు, ఒంటరితనం గురించి మాట్లాడుతుంది. క్రమంగా ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది.మరి చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా ? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఎందుకు ఇంత స్పెషల్ ?

ఈ సినిమా యువకుల ప్రేమ కథ కాదు. 40 ఏళ్లు దాటిన వయసులో కూడా ప్రేమ ఎలా ఉంటుంది, గతాన్ని మరచిపోవడం ఎంత కష్టం, కొత్త సంబంధానికి ఎంత ధైర్యం కావాలి అన్నది ఇందులో మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. ఇర్ఫాన్ ఖాన్ హ్యూమర్, సహజత్వం, పార్వతి సౌమ్యత సినిమాకి ప్రాణం పోశాయి. ఇర్ఫాన్ ఖాన్ – యోగిగా, పార్వతి తిరువోతు – జయగా, నేహా ధూపియా – క్యామియోలో కన్పిస్తారు.

Advertisement

Also Read : కడుపుతో ఉన్న కూతురిపై కసాయి తండ్రి క్రూరత్వం… రక్తాన్ని మరిగించే రివేంజ్ థ్రిల్లర్ సిరీస్

ఎక్కడ చూడాలి ?

‘క్వరీబ్ క్వరీబ్ సింగల్’ చూస్తే ప్రేమకు వయసు లేదని, సరైన వ్యక్తి వచ్చేసరికి హృదయం ఎలా మారిపోతుందో అర్థమవుతుంది. ఇర్ఫాన్ ఖాన్ ఫ్యాన్స్‌కి ఈ మూవీ మంచి ట్రీట్. ఈ సినిమా ఇప్పుడు Netflixలో అందుబాటులో ఉంది.

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×