E-Paper
Advertisement

Mystery movie OTT: విదేశీ మహిళ కోసం పడరాని పాట్లు… మెంటలెక్కించే ట్విస్టులున్న డిటెక్టివ్ థ్రిల్లర్

Mystery movie OTT: విదేశీ మహిళ కోసం పడరాని పాట్లు… మెంటలెక్కించే ట్విస్టులున్న డిటెక్టివ్ థ్రిల్లర్
Advertisement

Mystery movie OTT : డిటెక్టివ్ స్టోరీలు కామెడీ జానర్ లో వస్తే భలే సరదాగా నడుస్తుంటాయి. తెలుగులో సహా అనేక భాషల్లో ఇలాంటి సినిమాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి కూడా. రీసెంట్ గా వచ్చిన ఒక చైనీస్ మూవీ ఈ కంటెంట్ తో కేక పెట్టిస్తోంది కూడా. 1900 కాలం నాటి శాన్ ఫ్రాన్సిస్కో నేపథ్యంలో సాగే ఈ కథలో చైనాటౌన్‌లో జరిగిన ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. కామెడీతో పాటు, కంటెంట్ కూడా ఉంటుంది ఇందులో. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ చైనీస్ కామెడీ మిస్టరీ మూవీ పేరు ‘డిటెక్టివ్ చైనాటౌన్ 1900’ (Detective Chinatown 1900). 2025లో వచ్చిన ఈ సినిమా చెన్ సిచెంగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రధాన పాత్రల్లో లియు హావోరన్, వాంగ్ బావోకియాంగ్ నటించారు. వెటరన్ స్టార్ చౌ యున్-ఫాట్ కీలక పాత్ర పోషించారు. హాలీవుడ్ నటుడు జాన్ కుసాక్ ఇందులో విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని నాథన్ వాంగ్ అందించారు. 1900ల నాటి శాన్ ఫ్రాన్సిస్కోను ప్రతిబింబించేలా భారీ సెట్లతో ఈ సినిమాను చైనాలోని షాన్‌డాంగ్‌లో నిర్మించారు. ఈ చిత్రం 2025 జనవరి 29న చైనీస్ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1900వ సంవత్సరంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడ చైనీయులపై వివక్ష ఎక్కువగా ఉండేది. సరిగ్గా అదే టైమ్‌లో చైనాటౌన్‌లో ఒక తెల్లజాతి మహిళ దారుణంగా హత్యకు గురవుతుంది. ఈ హత్య వల్ల పెద్ద గొడవలు జరుగుతాయని, చైనాటౌన్‌ను మూసివేస్తారని అందరూ భయపడతారు. ఆ పరిస్థితుల్లో చైనా నుండి వచ్చిన డిటెక్టివ్ చిన్ ఫు ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ, ఈ హత్య వెనుక కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని అతనికి అర్థమవుతుంది.

ముఖ్యంగా ఒక పవర్ఫుల్ అమెరికన్ రాజకీయ నాయకుడు, తన స్వార్థం కోసం చైనీయులను అక్కడి నుండి వెళ్లగొట్టాలని ప్లాన్ చేసినట్లు చిన్ ఫు తెలుసుకుంటాడు. చివరికి డిటెక్టివ్ తన తెలివితేటలతో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ అసలు దోషిని ఎలా పట్టుకున్నాడు? చైనాటౌన్‌ను ఆ ముప్పు నుండి ఎలా కాపాడాడు? అనే విషయాలతో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.

Advertisement

Read Also : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి బీభత్సం… రాత్రయితే రెచ్చిపోతూ… ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×