E-Paper
Advertisement

Horror Thriller OTT : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి బీభత్సం… రాత్రయితే రెచ్చిపోతూ… ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్

Horror Thriller OTT : కూతురి బాయ్ ఫ్రెండ్ తో తల్లి బీభత్సం… రాత్రయితే రెచ్చిపోతూ… ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT : ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ తో మైండ్ బెండ్ అయ్యే సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా చూస్తే ఆడియన్స్ కి నిజంగానే మెంటలెక్కినంత పనవుతుంది. ఈ కథలో ప్రేయసి కోరిక మేరకు ఆమె పిచ్చి తల్లి బాగోగులు చూడటానికి వెళ్తాడు ప్రియుడు. అయితే అక్కడికి వెళ్ళాక స్టోరీ హారర్ మోడ్ కి వెళ్తుంది. ఒక్కో సీన్ వణికించేస్తుంది కూడా. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘క్రేజీ ఓల్డ్ లేడీ’ (Crazy Old Lady). దీని ఒరిజినల్ స్పానిష్ టైటిల్ Vieja loca. మార్టిన్ మౌరేగుయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కార్మెన్ మౌరా, డేనియల్ హెండ్లర్ నటించారు. ఇది 2025లో అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 27 నుండి Hulu, Shudder ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పెడ్రో అనే వ్యక్తికి ఒకరోజు తన మాజీ ప్రేయసి నుండి అర్జంటుగా ఫోన్ వస్తుంది. తన తల్లి అలీసియాకు ఒంట్లో బాలేదని, కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తోందని, తను వచ్చే వరకు ఆమెను కనిపెట్టుకుని ఉండమని కోరుతుంది. పెడ్రో సరేనని ఆ ముసలామె ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక పరిస్థితి మారుతుంది. ఆ ముసలామెకు నిజంగానే మతిస్థిమితం ఉండదు. ఆమె పెడ్రోని గుర్తుపట్టకపోగా.. తన గతం లోని ప్రేమికుడని పొరబడుతుంది. అక్కడితో ఆగకుండా అతన్ని బయటకు వెళ్లనివ్వకుండా ఇంటికి తాళాలు వేసేస్తుంది.

ఇక ఆ ఇంట్లో పెడ్రోకి నరకం కనిపిస్తుంది. ఆ ముసలామె తన పిచ్చిలో రకరకాల వింత ఆటలు ఆడుతూ అతన్ని చిత్రహింసలకు గురిచేస్తుంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి పెడ్రో చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు. ఒక దశలో ఆమెకు ఉన్న భయంకరమైన సైకో కోణం బయటపడుతుంది. చివరికి ఆ ముసలామె నుంచి తప్పించుకుని పెడ్రో ప్రాణాలతో బయటపడ్డాడా ? ఆమె చేతిలో బలయ్యడా అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : వేశ్యల దుకాణంలో మెంటలెక్కించే మర్డర్లు … ఓటీటీలో టాప్ లేపుతున్న సిరీస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×