E-Paper
Advertisement

Mystery thriller OTT: జంటను వెంటాడే పుస్తకం… నెంబర్ గేమ్ తో మలుపులు… ఇంటెన్స్ గా సాగే స్టోరీ

Mystery thriller OTT: జంటను వెంటాడే పుస్తకం… నెంబర్ గేమ్ తో మలుపులు… ఇంటెన్స్ గా సాగే స్టోరీ
Advertisement

Mystery thriller OTT : మలయాళ సినిమాలను ఇప్పుడు క్రేజీగా చూస్తున్నారు మన ప్రేక్షకులు. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. స్టోరీలను రియాల్టీ కి దగ్గరగా ప్రజెంట్ చేయడంలో ఆదర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. ఇక ఈ సినిమాలను కూడా ఇంట్లోనే కూర్చుని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో క్రైమ్, హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్లు కూడా అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మిస్టరీ మూవీ ఆసక్తికరమైన కథనంతో సాగుతోంది. ఈ మూవీ ఒక మ్యాజిక్ బుక్ తో మొదలవుతుంది. ఆ బుక్ లో ఉన్నవి, బయట కూడా జరుగుతుంటాయి. ఆ వచ్చే సీన్స్ సస్పెన్స్ తో టెన్షన్ పెడుతుంటాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓ లుక్ వేయాల్సిన సినిమా ఇది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ’32వ అధ్యాయం 23వ వాక్యం’ (32aam Adhyayam 23aam Vaakyam). ఈ సినిమాలో గోవింద్ పద్మసూర్య (ఫ్రెడ్డీ), మియా జార్జ్ (అన్న), లాల్ (రవి) ప్రధాన పాత్రలు పోషించారు. 2015 జూన్ 19న విడుదలైన ఈ సినిమాకు అర్జున్ ప్రభాకరన్, గోకుల్ రామకృష్ణన్ దర్శకత్వం వహించగా, బిజిబాల్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అన్న, ఫ్రెడ్డీ అనే జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతుంటారు. ఫ్రెడ్డీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అమెరికాలో జాబ్ చేస్తుంటాడు. అయితే వాళ్ల మొదటి పెళ్లి రోజు కోసం ఇంటికి వచ్చినప్పుడు, ఒక ఫ్రెండ్ వాళ్లకి ఒక పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ పుస్తకం పేరు ’32వ అధ్యాయం 23వ వాక్యం’. సరదాగా చదవడం మొదలుపెట్టిన ఫ్రెడ్డీకి, ఆ పుస్తకంలోని హీరో పాత్ర సరిగ్గా తనలాగే అనిపిస్తుంది. ఆ హీరోకి కూడా పెళ్లయి ఉంటుంది, పైగా అతని భార్య పేరు కూడా అన్ననే. పుస్తకంలో జరిగే ప్రతి విషయం తన నిజ జీవితంలో కూడా జరుగుతుండటంతో ఫ్రెడ్డీకి భయం మొదలవుతుంది. ముఖ్యంగా 23 అనే నంబర్ చుట్టూ ఏదో ప్రమాదం పొంచి ఉందని అతను నమ్ముతాడు.

ఆ పుస్తకంలో ఒక అమ్మాయి 23వ ఏట చనిపోతుందని ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి అన్నకి కూడా 23 ఏళ్లు నిండుతుంటాయి. దీంతో ఫ్రెడ్డీ పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఎక్కడ చూసినా 23 నంబరే కనిపిస్తుండటంతో, తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని టెన్షన్ పడతాడు. ఫ్రెడ్డీ నమ్ముతున్నది నిజమా ? ఎవరో కావాలనే అతన్ని ట్రాప్ చేస్తున్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? చివరకు ఆ ’23వ వాక్యం’ తన జీవితాన్ని ఎలా మార్చేసింది ? అనే విషయాలతో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

Advertisement

Read Also : Comedy drama OTT: పెళ్ళైనా ఆ పనికి నోచుకోని జంట…మరో అమ్మాయితో అలాంటి పని… క్లైమాక్స్ కేక

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×