E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాకు అవమానం.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. మీనాకు అవమానం.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. విద్య దగ్గరికి వెళ్లి నేను ఆ డబ్బులు తీసుకొని వస్తాను అని రోహిణి అంటుంది.. ఇక విద్య అక్కడికి వెళ్ళగానే సుగుణమ్మ కూడా అలాగే వెళ్లడంతో రాజేష్ అది చూసి బాలు కి ఫోన్ చేసి చెప్తాడు. అయితే బాలు వీళ్లిద్దరు ఎందుకు అటు వెళ్లారు అని తెలుసుకునేందుకు వస్తాడు.. రోహిణికి సుగుణమ్మ దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అయితే రోహిణి చింటుతో ఆడుకుంటూ సరదాగా కడుతుంది. ఇక బాలు కి విద్య మీద డౌట్ రావడంతో తన ఇంటికి వస్తాడు.. అయితే విద్య ఆ విషయాన్ని ఫోన్ చేసి బాలు కి డౌట్ వచ్చింది మన ఇంటి వైపే వస్తున్నాడు అని అనగానే రోహిణి అలర్ట్ అవుతుంది.

డోర్ తీయడానికి వెళ్ళిన చింటూని రోహిణి ఆపేసి లోపలికి తీసుకొని వెళుతుంది.. అయితే బాలు కిటికీలోంచి చూసి ఎవ్వరు లేరు రాజేష్ ఎందుకు ఇలా చెప్పాడు అని అంటాడు. అక్కడినుంచి బాలు వెళ్ళగానే విద్య అక్కడికొస్తుంది.. మొత్తానికి బాలు నుంచి రోహిణి తప్పించుకుంటుంది.. మేక మామ మళ్లీ రావడంతో రోహిణి అడ్డంగా దొరికిపోయిందని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు ఏంటి పాలరమ్మ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.. విద్య దగ్గర వడ్డీ డబ్బులు తీసుకొని వచ్చేసాను అని అంటుంది. తర్వాత రోజు ఉదయం బాలు మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ సుమతి ఏదో గొడవ జరిగి ఉంటుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన శివ తనని ఎగ్జామ్ రాయనివ్వకుండా గుణ చేస్తున్నాడని చెప్పగానే బాలు నేను ఎగ్జామ్ రాసేలా చేస్తాను అని అంటాడు.. ఇక మీనా ఒక పార్సల్ తీసుకొని వచ్చిన వ్యక్తితో మాట్లాడుతుంది.. ఆ పార్సల్ వచ్చింది శృతి కోసం అని తెలుసుకొని దాన్ని తీసుకొని లోపల పెడుతుంది.. అయితే దాన్ని చూసిన ప్రభావతి ఆ ఏమొచ్చిందని చూడాలని ప్రభావతి అనుకుంటుంది. ఒకవైపు మీనా అలా చూడడం తప్పు కదా అత్తయ్య అని ఎంతగా చెబుతున్నా సరే మీ నా మాట వినకుండా ప్రభావతి పార్సెల్ ని ఓపెన్ చేస్తుంది..

అందులో హెడ్సెట్ ఉండడం చూసినా ప్రభావతి దీన్ని ఎలా వాడతారు ఇదేదో బాగుంది అని అనుకుంటుంది. ఇది నేను పెట్టుకుంటే చాలా బాగుంది కదూ అని తనలో తానే మాట్లాడుకుంటూ దాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. అది చూసిన మీనా అలా ఓపెన్ చేసి వేరే వాళ్ళది చూడడం తప్పు.. శృతికి తెలిస్తే బాధపడుతుంది కదా అత్తయ్య అని చెప్తున్నా సరే నీకెందుకు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని అంటుంది.. అయితే దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అబ్బా పాటలు రావడం లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. అలా పెట్టుకుంటే పాటలు రావు దానికి ఫోన్ కనెక్ట్ చేస్తే వస్తాయి అని మీనా అంటుంది.. నాకు తెలుసులే ఎలా ఉంటుందని టెస్ట్ చేస్తున్నానని మీనా అంటుంది..

Advertisement

అప్పుడే లోపలికి వచ్చిన శృతి దాన్ని చూసి ఇది మీరు కూడా హెడ్సెట్ ఆర్డర్ పెట్టుకున్నారా అని అడుగుతుంది. కాదమ్మా ఇది నీదే అని అనగానే ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. ఏంటి ఆంటీ మీరు వాడు డబ్బాలో పెట్టి ఇవ్వకుండా తీసుకున్నారా అని అడుగుతుంది. లేదమ్మా డబ్బాలు పెట్టి ఇచ్చాడు. ఏముందని నేను ఓపెన్ చేశాను అని అనగానే శృతి రెచ్చిపోతుంది. నా పర్మిషన్ లేకుండా నాకు వచ్చిన పార్సెల్ ని ఎలా ఓపెన్ చేస్తారు అని శృతి అడుగుతుంది. అయినా కొంచెమైనా బుద్ధి ఉండాలి వేరే వాళ్ళ పర్సనల్స్ ని చూడాల్సిన అవసరం మీకేంటి అని శృతి అంటుంది.. అయితే ప్రభావతి ఎంతగా వద్దని వాదిస్తున్న సరే శృతి మాత్రం నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే మా అమ్మ అయినా సరే నాకు కోపం వస్తుంది అని అంటుంది..

ఇక రవి అమ్మ ఏదో తెలుసుకుందాం అని ఓపెన్ చేసి ఉంటుంది దానికి ఎందుకు నువ్వు వింతగా సీరియస్ అవుతున్నావు అని అంటాడు. నేను ఏమీ సీరియస్ అవ్వడం లేదు నా వస్తువులు ఎవరు తగిలినా నాకు నచ్చదు అదే చెప్తున్నాను సారీ అంటే మీరు ఫీల్ అయితే అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడున్న మీనా దగ్గరికి వచ్చిన ప్రభావతి ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? ఇప్పుడు నువ్వు చాలా హాయిగా ఉన్నావు కదా అనేసి దుమ్మెత్తి పోస్తుంది.. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నాకెందుకు అలా అనిపిస్తుంది అని మీనా ఎంత చెప్తున్నా సరే వినకుండా ప్రభావతి అవమానించి వెళ్తుంది.

రవి ఒకసారి నువ్వు నాతో పాటు రా నీతో మాట్లాడాలి అని రవి ని పక్కకు తీసుకొని వెళ్లి ఏంట్రా నీ పెళ్ళాము నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అత్త అని కొంచెం కూడా భయం లేదు అని తిడుతుంది.. నువ్వు కూడా బాలు లాగా తయారవుతున్నావా భార్యని నెత్తినెక్కి ఇచ్చి కూర్చోబెట్టుకుంటున్నావా? వాడు అంతే ఆ పూలు అమ్ముకునేది ఏం చెప్తే అదే వింటున్నాడు.. ఇక తర్వాత ఆ మాట విన్న మీనా బాధ పడిపోతుంది.. రవి నినా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చేసి తన బాధని తగ్గించాలి అని అనుకుంటాడు. కానీ నాకు అలవాటైపోయింది లే రవి అత్తయ్య నన్ను అవమానించకుండా అనకుండా ఆవిడకు పొద్దు పోదు అని మీనా అంటుంది..

Also Read :చక్రీపై మహాకు అనుమానం.. క్లాస్ పీకిన మాధవ్.. మహాకు షాకిచ్చిన నారాయణ..

ఆ తర్వాత బాలు శివని కాలేజీలో మళ్లీ తిరిగి రప్పించేందుకు కాలేజీకి వెళ్తాడు.. కాలేజీని చూసి చాలా సంతోషంగా ఉంటాడు. కాలేజ్ అంటే ఇలా ఉంటుందా ఏ రోజు కాలేజీకి వచ్చిన మొహం కాదు నాది అందుకే ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.. శివ గురించి మాట్లాడాలని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే అతను మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదని చెప్తాడు. ఫ్యూన్ చెప్పిన కూడా బాలు వినకుండా ఏదో ఒకటి చేయండి తాతా అని ప్రతిమలాడుతాడు.. మొత్తానికి బాలు అయితే శివని కాలేజీకి పంపించే ప్లాన్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఏం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×