E-Paper
Advertisement

తల్లి మిస్సింగ్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు… డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్

తల్లి మిస్సింగ్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు… డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Thriller on OTT : ఓటీటీలో ఒక ఉత్కంఠభరితమైన సైబర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఊహించని మలుపులతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, కథ మొత్తం ల్యాప్‌టాప్ స్క్రీన్‌లు, స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు, సీసీటీవీ ఫుటేజీలు, ఫేస్‌టైమ్ కాల్స్, గూగుల్ మ్యాప్స్ వంటి డిజిటల్ యాప్‌ల ద్వారానే సాగుతుంది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలను ఎక్కువగా వాడే నేటి యువతరానికి, ఈ సరికొత్త మేకింగ్ శైలి చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది. ఒక అమ్మాయి ఇంట్లోనే కూర్చుని కేవలం ఇంటర్నెట్ ఆధారాల ద్వారా అంతర్జాతీయంగా ఉన్న ఒక కిడ్నాప్ మిస్టరీని ఎలా ఛేదించిందనేది ఇందులో అద్భుతంగా చూపించారు. సస్పెన్స్, సైకో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

2023లో విడుదలైన ఈ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘మిస్సింగ్’ (Missing). విల్ మెరిక్, నిక్ జాన్సన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన సూపర్ హిట్ సినిమా Searching (సెర్చింగ్)కు ఇది సీక్వెల్. ఈ సినిమా కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ యాప్‌ల ద్వారానే సాగుతుంది. ఇందులో స్టోర్మ్ రీడ్, నియా లాంగ్, కెన్ ల్యూంగ్, జోక్విమ్ డి అల్మేడా లీడ్ రోల్స్ లో నటించారు. $7 మిలియన్ల (సుమారు ₹58 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $48.8 మిలియన్లు (సుమారు ₹400 కోట్లు) వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో సబ్‌స్క్రిప్షన్ తో చూడవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే మూవీస్, యాపిల్ టీవీలలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జూన్ అనే కాలేజీ అమ్మాయికి వాళ్ల అమ్మ గ్రేస్ అంటే కొంచెం పడదు. చిన్నప్పుడే భర్త చనిపోవడంతో గ్రేస్ తన కూతురిని ఎంతో పద్ధతిగా పెంచుతుంది. ఒకరోజు అమ్మ తన కొత్త స్నేహితుడు కెవిన్‌తో కలిసి కొలంబియా టూర్‌కి వెళ్తుంది. అమ్మ ఊళ్లో లేని సమయాన్ని వాడుకుని జూన్ స్నేహితులతో కలిసి ఇంట్లోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది. వారం తర్వాత అమ్మను తీసుకురావడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిన జూన్‌కి పెద్ద షాక్ తగులుతుంది. ఫ్లైట్ దిగిన వారిలో అమ్మ గానీ, కెవిన్ గానీ ఉండరు. ఫోన్ చేసినా కలవకపోవడంతో జూన్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది.

ఇక పోలీసులు అంతర్జాతీయ చట్టాల వల్ల వెంటనే ఏమీ చేయలేమని చెప్పడంతో, జూన్ స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఇంట్లోనే కూర్చుని లాప్‌టాప్ ద్వారా అమ్మ జిమెయిల్, ఫేస్‌బుక్ ఖాతాలను హ్యాక్ చేసి వెతకడం మొదలుపెడుతుంది. ఈ విచారణలో కెవిన్ చాలా మంది ఆడవాళ్లను మోసం చేసిన క్రిమినల్ అని, కావాలనే అమ్మను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని తెలుస్తుంది. అయితే అంతలోనే కొలంబియాలో కెవిన్‌ను ఎవరో కాల్చి చంపేస్తారు. దాంతో అమ్మ ఎక్కడుందో తెలియక జూన్ పూర్తిగా అయోమయంలో పడిపోతుంది.

Advertisement

ఇక్కడే కథలో ఊహించని మలుపు ఎదురవుతుంది. చిన్నప్పుడే జబ్బుతో చనిపోయాడనుకున్న జూన్ కన్నతండ్రి జేమ్స్ అసలు చనిపోలేదు. వాడు డ్రగ్స్‌కి బానిసై భార్యను హింసించేవాడు. వాడి బారి నుండి తప్పించుకోవడానికే గ్రేస్ పోలీసులకు ఫిర్యాదు చేసి, పేరు మార్చుకుని కూతురితో సహా పారిపోయింది. జైలు నుండి విడుదలైన జేమ్స్, ప్రతీకారంతో కెవిన్‌ను వాడుకుని గ్రేస్‌ను కిడ్నాప్ చేయిస్తాడు. చివరికి జేమ్స్ నేరుగా జూన్ ఉన్న ఇంట్లోకి వచ్చి, ఆమెను కూడా బంధించి ఒక పాత ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ అమ్మ, కూతురు ఇద్దరినీ చంపడానికి ప్రయత్నిస్తాడు. మరి అమ్మ, కూతురు జేమ్స్ నుంచి బతికి బయట పడతారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : వారానికి ఒకసారి వచ్చే ఏకాంత సమయం… పెళ్ళి తర్వాత కూడా పక్క చూపులు… అన్నీ అలాంటి సీన్లే

Tags

Related News

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

Big Stories

Advertisement
×