E-Paper
Advertisement

వారానికి ఒకసారి వచ్చే ఏకాంత సమయం… పెళ్ళి తర్వాత కూడా పక్క చూపులు… అన్నీ అలాంటి సీన్లే

వారానికి ఒకసారి వచ్చే ఏకాంత సమయం… పెళ్ళి తర్వాత కూడా పక్క చూపులు… అన్నీ అలాంటి సీన్లే
Advertisement

Romantic Movie on OTT : ఒక మనిషి జీవితంలోకి ప్రేమ లేట్‌గా ఎంట్రీ ఇస్తే అది నిజంగా ప్రేమేనా? లేదా ఒంటరితనానికి దొరికిన ఓదార్పా? ఇది రియల్‌ లైఫ్‌లో చాలామందికి ఉండే డౌట్ కదా..? అయితే ఈ రియల్ లైఫ్‌ డౌట్‌కి రీల్‌ లైఫ్‌ ఆన్సర్‌ ఇచ్చే సినిమా ఒకటుంది. ప్రతిరోజూ ఒకేలా గడిచే జీవితం ఒక్క వ్యక్తి రావడంతో పూర్తిగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారా? వయసు, పరిస్థితులు, సమాజం లాంటి అంశాలు ఒక వైపు నిలబడితే.. మనసు మాత్రం మరో దారి చూపిస్తుంది. ఇలాంటి భావోద్వేగాలతో ముందుకు సాగే రొమాంటిక్ డ్రామా కథే 7:20 వన్స్ ఏ వీక్‌(Once a Week).

ఎక్కడ చూడచ్చంటే?

2018లో విడుదలైన ఈ మెక్సికన్ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం యాపిల్ టీవీ(Apple TV), ఫ్యాన్‌డ్యాంగో(Fandango)లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి మాటియాస్ బిజే దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రధాన పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలను చాలా నెమ్మదిగా, సహజంగా చూపించారు. ఎక్కువగా సంభాషణలు, పాత్రల భావాలు, వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ కథ తిరుగుతుంది. వేగంగా సాగే కథలా కాకుండా, నెమ్మదిగా మనసులోకి దూరే సినిమా ఇది. సినిమాలో ఎవా అరియాస్, జోసీన్ బెర్నాట్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరి నటన ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్స్‌ను చాలా సహజంగా చూపించారు.

స్టోరీ ఏంటంటే?

Advertisement

కథలో ఒక మధ్య వయస్కుడు తన సాధారణ జీవితంతో విసిగిపోయి ఉంటాడు. అతని జీవితం ప్రతిరోజూ ఒకేలా సాగుతుంది. బయటకు ప్రశాంతంగా కనిపించినా, లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో అతని జీవితంలో ఒక యువతి ప్రవేశిస్తుంది. మొదట చిన్న పరిచయంగా మొదలైన వారి సంబంధం, క్రమంగా ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌కి కారణమవుతుంది.

ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉన్నా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ దగ్గరవుతారు. ప్రతి వారం ఒకే సమయానికి కలవడం వారి జీవితంలో భాగమవుతుంది. ఆ క్షణాల కోసం ఎదురుచూడటం ప్రారంభమవుతుంది. అయితే బయట ప్రపంచం ఈ బంధాన్ని ఎలా చూస్తుంది? వారి నిర్ణయాలు సరైనవేనా అనే సందేహాలు క్రమంగా పెరుగుతాయి?

Advertisement

ఈ సంబంధం వల్ల ఇద్దరి జీవితాల్లో మార్పులు మొదలవుతాయి. ఒకవైపు ఆనందం కనిపించినా, మరోవైపు భయం కూడా వెంటాడుతుంది. సమాజం, కుటుంబం, వ్యక్తిగత భావోద్వేగాలు మధ్య వారు తీసుకునే నిర్ణయాలు కథను ముందుకు తీసుకెళ్తాయి. క్రమంగా ఈ బంధం వారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేసిందో బయటపడుతుంది. ప్రేమ అనేది కేవలం వయసుతో సంబంధం ఉన్న విషయం కాదని, ఒంటరితనంలో ఒక మనిషికి మరో మనిషి ఎంత ముఖ్యమవుతాడో ఈ సినిమా చూపిస్తుంది. భావోద్వేగాలను నెమ్మదిగా చెప్పే కథగా ఈ మూవీ చాలా స్పెషల్‌గా నిలుస్తుంది.

Read Also : సీక్రెట్ మొబైల్ యాప్ వలలో చిన్న పిల్లలు… మెంటలెక్కించే సైకలాజికల్ మైండ్ గేమ్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×