E-Paper
Advertisement

Mystery Thriller ott : సీక్రెట్ ల్యాబ్ నుంచి చిన్న పిల్ల మిస్సింగ్… కట్ చేస్తే మైండ్ బెండయ్యే షాక్

Mystery Thriller ott : సీక్రెట్ ల్యాబ్ నుంచి చిన్న పిల్ల మిస్సింగ్… కట్ చేస్తే మైండ్ బెండయ్యే షాక్
Advertisement

Mystery Thriller ott : కొరియన్ సినిమాలకు క్రేజ్ మరింత పెరుగుతోంది. ప్రేక్షకులు ఈ స్టోరీలకు ఫిదా అవుతున్నారు కూడా. ఇక వెబ్ సిరీస్ లను చూస్తూ కాలం గడిపేస్తున్నారు కొంతమంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక సూపర్‌ హ్యూమన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కావాల్సినంత యాక్షన్ కూడా ఉంటుంది. ఇంటెన్స్‌గా సాగే ఈ సూపర్ హిట్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ కి బెస్ట్ ఛాయిస్. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది విచ్: పార్ట్ 1 – ది సబ్‌వర్షన్’ (The Witch: Part 1 – The Subversion). 2018లో వచ్చిన ఈ సినిమా పార్క్ హూన్-జుంగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో కిమ్ దా-మి (జూన్) లీడ్ రోల్‌లో నటించారు. మిన్-సూ, చోయి మిన్-సిక్, పార్క్ హీ-సూన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఐయండిబిలో 7.1/10 రేటింగ్ ఉన్న ఈ మూవీ, కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ లవర్స్‌కు మస్ట్ వాచ్ మూవీ. ఇది netflix లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : సడన్ గా మిస్సయ్యే భార్య… కల్లోనే భర్తకు దారి చూపే ఆధారాలు… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

జూన్ అనే 20 ఏళ్ల అమ్మాయి 8 ఏళ్ల క్రితం కనిపించకుండా పోతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడూ వెతికేస్తూ ఉంటారు. ఒక రోజు జూన్ సడన్‌గా ఇంటికి తిరిగి వస్తుంది. ఆమెకు గత జ్ఞాపకాలు లేవు. తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. కానీ జూన్ బాడీలో ఏదో స్పెషల్ ఉందని తెలుస్తుంది. ఆమె సూపర్‌హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్ కలిగి ఉంటుంది. క్రమంగా జూన్ గతం గుర్తొస్తుంది. ఆమె ఒక టాప్సీ క్రెట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లో భాగం. ఆమెను ఒక ల్యాబ్‌లో జెనిటిక్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసి సూపర్ సోల్జర్‌గా మార్చారు.

Advertisement

ఆమె ఎస్కేప్ అయి గత 8 ఏళ్లు దాక్కుని ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ బాస్ ఆమెను మళ్లీ క్యాప్చర్ చేయాలని పంపిస్తాడు. హై-లెవల్ అస్సాసిన్స్ వస్తారు. జూన్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ వస్తాయి. చివరికి ఆమె తన ఫ్యామిలీని కాపాడుకుంటుందా ? ఆమెపై ఎలాంటి ప్రయోగాలు జరిగాయి ? ఎందుకు ఆమెను పట్టుకోవడానికి చూస్తున్నారు ? ఈ కథ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×