E-Paper
Advertisement

Suspense Thriller ott : 100 ఏళ్లలో మిస్సైన 4400 మంది ఒకేచోట… ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి భయ్యా

Suspense Thriller ott : 100 ఏళ్లలో మిస్సైన 4400 మంది ఒకేచోట… ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి భయ్యా
Advertisement

Suspense Thriller ott : సైన్స్ ఫిక్షన్ స్టోరీలు అబ్బురపరిచే విజువల్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్లే ఉంటుంది ఇలాంటి జోనర్ స్టోరీలను చూస్తే. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఊహకు అందని సస్పెన్స్ తో సాగుతుంది. ఆకాశం నుంచి ఒక్క సారిగా కొంత మంది ఊడి పడతారు. వాళ్ళకు గతం కూడా గుర్తుకు ఉండదు. ఈ స్టోరీ చూడటానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. ఒక మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ టెలివిజన్ సిరీస్ పేరు ‘4400’. అరియానా జాక్సన్ దీనిని రూపొందించారు. ఇది 2004 టెలివిజన్ సిరీస్ ‘ది 4400’ కి రీబూట్. ఇది 2021అక్టోబర్ 25 నుంచి Amazon prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  ఊరిని తుడిచిపెట్టే వింత వ్యాధి… లవర్ కోసం జాంబీల ఊచకోత… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

స్టోరీ ఏమిటంటే

డెట్రాయిట్‌లోని ఒక పార్కులో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వింత కాంతి వస్తుంది. ఆ కాంతి నుండి 4400 మంది వ్యక్తులు బయటకు వస్తారు. వీరంతా గత వంద ఏళ్లలో వివిధ కాలాల్లో మాయమైన వారు. వారందరికీ తాము మాయమైన సమయం నుండి ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా గడిచినట్లు అనిపించదు. ఇక వీళ్ళ వయస్సులో కూడా ఎలాంటి మార్పు ఉండదు. 1950లో మాయమైన 20 ఏళ్ల యువతి, 2021లో కూడా 20 ఏళ్ల యువతిగానే తిరిగి వస్తుంది. ప్రభుత్వం వీరిని ఒక ముప్పు గా భావిస్తుంది. వాళ్ళందరిని ఒక పాత హోటల్‌లో బంధించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది.

Advertisement

ఇక అసలు కథ మొదలవుతుంది. తిరిగి వచ్చిన వాళ్ళు తమ కుటుంబాల కోసం ఆరాటపడతారు. కానీ వారిలో చాలా మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే చనిపోయి ఉంటారు. కొంతమంది వృద్ధులై ఉంటారు. హోటల్‌లో ఉన్న 4400 మందిలో కొందరికి సూపర్ పవర్స్ కూడా ఉంటాయి. ఈ శక్తుల వల్ల ప్రభుత్వం మరింత భయపడి వారిపై కఠినమైన నిబంధనలు విధిస్తుంది. సిరీస్ సాగుతున్న కొద్దీ ఒక ఆసక్తికరమైన నిజం బయటపడుతుంది. ఆ నిజం ఏమిటి ? వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ? వీళ్ళకు ఉన్న సూపర్ పవర్స్ దేనికి సంకేతం ? ఈ సిరీస్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ సిరీస్ పై ఓ లుక్ వేయండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×