E-Paper
Advertisement

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!
Advertisement

Jagapathi Babu Talk Show: ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు నిర్మాణ రంగంలో దూసుకుపోతూ.. ఇంకొక వైపు ఇలా టాక్ షోలలో సందడి చేస్తున్నారు.. అలాంటి వారిలో జగపతిబాబు(Jagapathi Babu)కూడా ఒకరు. తనదైన మాట తీరుతో, చలాకీ తనంతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ సీనియర్ నటుడు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సెలబ్రిటీ టాక్ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ మరింత బిజీగా మారిపోయారు

జగపతిబాబు టాక్ షోలో నారా లోకేష్..

ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5 వేదికగా ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. తాజాగా సీజన్ 2 నడుస్తోంది. గత ఎపిసోడ్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు ప్రముఖ కమెడియన్ సునీల్ వచ్చి సందడి చేశారు. అయితే ఇప్పుడు తాజాగా దీపావళి సందర్భంగా నవంబర్ 6వ తేదీన టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కి ఏపీ మంత్రి నారా లోకేష్ గెస్ట్ గా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని అధికారికంగా ప్రముఖ ఓటీటీ జీ5 రిలీజ్ చేసింది. దీపావళి ప్రత్యేక ఎపిసోడ్లో..” అగ్నిగుండం లాంటి జగపతిబాబుతో మరో అగ్నిగుండం నారా లోకేష్ కలుస్తోంది . తొలిసారి ఫిల్టర్ చేయని ఐకానిక్ ఇంటరాక్షన్ కోసం సిద్ధంగా ఉండండి” నవంబర్ 6న తెలుగు జీ5లో ప్రీమియర్ కాబోతోంది. ఇక నవంబర్ 8వ తేదీ రాత్రి 7:30 గంటలకు జగపతిబాబుతో జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ని ప్రత్యేకంగా జీ ఫైవ్ టీవీలో చూడండి అంటూ అధికారికంగా ప్రకటించింది.

అందరికంటే ఎక్కువగా కొట్టింది నన్నే – నారా లోకేష్..

Advertisement

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నారా లోకేష్ తన మామ బాలయ్య గురించి ఎన్నో రహస్యాలు రివీల్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. “ప్రజలే దేవుళ్ళు అని ప్రజాసేవ చేస్తున్న యువ గళం నారా లోకేష్ ” అంటూ జగపతిబాబు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇక ఈ ప్రోమోలో పలు విషయాలు పంచుకున్న నారా లోకేష్ మాట్లాడుతూ “జై బాలయ్య” అంటూ అభిమానులను సంతోషపరిచారు. ఇక ఆయన మాట్లాడుతూ..”బాలయ్య బాబు గారు ఒకే ఒక్కరికి భయపడతారు” అంటూ చెప్పిన లోకేష్.. “చిన్నప్పుడు స్కూల్లో అందరూ టీచర్లు ఎక్కువగా కొట్టింది నన్నే” అంటూ తన చిన్ననాటి విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆ అల్లరి కూడా ఉండేదా? అని జగపతిబాబు ప్రశ్నించగా..” అప్పుడప్పుడు మామ బాలయ్య బాబుతో కూడా పోటీపడాలి కదా” అంటూ తన విషయాలను కూడా పంచుకున్నారు.

also read: ధనుష్ పొలిటికల్ మీటింగ్.. 3000 మంది మహిళా ప్రతినిధులతో!

బాలయ్య డైలాగ్ తో అదరగొట్టేసిన నారా లోకేష్..

Advertisement

“ఒకరోజు అల్లుడుగారు అని పిలిచారు. ఏదో ఫిట్టింగ్ పెడుతున్నారు అనుకున్నాను” అంటూ తన పెళ్లి విషయాలను కూడా షేర్ చేశారు నారా లోకేష్. “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” అని బాలయ్య డైలాగ్ చెప్పి అదరగొట్టారు. దీంతో ఈ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఎపిసోడ్లో నారా లోకేష్ ఇంకేం మాట్లాడతారో అని అటు అభిమానులతో పాటు ఇటు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&dlrf=NTc4MTIwNjQ2YQ==

Related News

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్

చక్రవర్తి సింహాసనానికే ఎసరు పెట్టే నింజాలు… ఒక్క సీక్రెట్ బయటకొస్తే బ్లడీ బ్లడ్ బాత్… యాక్షన్ తో ఇరగదీస్తున్న సిరీస్

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

Big Stories

Advertisement
×