Freezer Defrosting: ఫ్రిడ్జ్‌లోని ఫ్రీజర్‌లో పేరుకుపోయిన మంచును (Ice build-up) తొలగించడం చాలామందికి పెద్ద సవాలుతో కూడుకున్న పని. సాధారణంగా చాలామంది డిఫ్రాస్ట్ చేసే క్రమంలో సహనం నశించి కత్తులు, పదునైన వస్తువులతో గుచ్చడం, మరిగే వేడి నీళ్లను (Boiling water) ఫ్రీజర్‌లో చల్లడం వంటివి చేస్తుంటారు. అయితే కత్తితో గుచ్చడం వల్ల గ్యాస్ పైపులు లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మరిగే నీటి వల్ల ఫ్లాస్టిక్ భాగాలు పగిలిపోయే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రీజర్‌కు ఎలాంటి ప్రమాదం లేకుండా పేరుకుపోయిన మంచును ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని శుభ్రం చేసేటప్పుడు భద్రతే ఫస్ట్ ప్రయారిటీ. ఫ్రీజర్‌ను డిఫ్రాస్ట్ చేయడానికి ముందు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తొలగించండి. దీనివల్ల విద్యుత్ షాక్ ప్రమాదం తగ్గడమే కాకుండా కరుగుతున్న మంచు నీరు బయటకు వెళ్తుంది. అప్పటివరకూ ఫ్రీజర్‌లో ఉన్న ఆహార పదార్థాలను తీసి ఒక కూలర్ బాక్స్‌లో భద్రపరుచుకోండి.
కత్తులు వాడకుండా మంచును త్వరగా కరిగించడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ముందుగా కొద్దిగా వేడిగా ఉన్న నీటిని ఒక గిన్నెలో తీసుకోండి. ఆ వేడి నీటి గిన్నె కింద మందపాటి టవల్ వేసి, ఫ్రీజర్ మధ్యలో ఉంచండి. ఫ్రీజర్ డోర్ మూసివేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ నీటి నుండి వచ్చే వేడి ఆవిరి (Steam) ఫ్రీజర్ గోడలకు ఉన్న మంచును వేగంగా కరిగిస్తుంది.
మంచు త్వరగా ఊడిరావడానికి ఇది మరొక మార్గం. ఒక కాటన్ గుడ్డను వేడి నీటిలో ముంచి దానికి కొద్దిగా రుబ్బింగ్ ఆల్కహాల్ (Rubbing Alcohol) రాయాలి. ఈ గుడ్డతో మంచు పొరలపైన నిమ్మదిగా రుద్దడం వల్ల ఆల్కహాల్ వేడి ప్రభావానికి మంచు వేగంగా కరిగిపోతుంది.
పై చిట్కాలతో మంచు కొద్దిగా కరిగిన తర్వాత మిగిలిన దాన్ని తొలగించడానికి పదునైన లోహపు వస్తువులకు బదులు.. ప్లాస్టిక్ లేదా చెక్క గరిటెను మాత్రమే వాడాలి. దీని వల్ల ఫ్రీజర్ లోపలి వాల్స్ కు ఎటువంటి గీతలు పడవు.
Also Read: స్లీప్ మోడ్‌లో ల్యాప్‌టాప్ పెడుతున్నారా? వెంటనే ఆపండి.. లేదంటే తప్పదు భారీ మూల్యం!
మంచు పూర్తిగా కరిగిన తర్వాత పొడి గుడ్డతో ఫ్రీజర్ లోపలి భాగమంతా తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. ఫ్రీజర్‌లో తేమ ఉంటే మళ్లీ వెంటనే మంచు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మళ్లీ స్విచ్ ఆన్ చేసి ఆహారా పదార్థాలను లోపల పెట్టి యధాతథంగా వాడుకోవచ్చు.
Also Read: అమెరికన్లు బట్టలు బయట ఎందుకు ఆరేయరు? కారణాలు తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు!