E-Paper
Advertisement

Anaganaga oka Raju OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన అనగనగా ఒక రాజు.. ఎప్పుడు ఎక్కడంటే?

Anaganaga oka Raju OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన అనగనగా ఒక రాజు.. ఎప్పుడు ఎక్కడంటే?
Advertisement

Anaganaga oka Raju OTT:యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. స్టాండప్ కమెడియన్ గా కెరియర్ ను మొదలుపెట్టి, ఆ తర్వాత పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ వస్తున్న ఈయన.. ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ సినిమాతో హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి నవీన్ పోలిశెట్టి చివరిగా ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న నవీన్ పోలిశెట్టి.. రెండేళ్లు విరామం తీసుకుని మళ్లీ ఈ ఏడాది ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న అనగనగా ఒక రాజు..

దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమాలో సంక్రాంతి హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నన్ ఒక రేంజ్ లో మెప్పించింది. పండుగ సెలవులు కావడంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ కూడా ఆసక్తి చూపించారు. అలా జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాగానే కలెక్షన్లు అందుకుంది. ముఖ్యంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి సంక్రాంతి బరిలో సూపర్ హిట్ గా నిలిచినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక అలా థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

స్ట్రీమింగ్ అయ్యేది ఆ రోజే..

Advertisement

అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ లీడింగ్ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఏ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ:Dhurandhar 2: ధురంధర్ 2లో టాలీవుడ్ హీరోయిన్.. డైరెక్టర్ కీలక నిర్ణయం?

అనగనగా ఒక రాజు సినిమా స్టోరీ..

Advertisement

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. గౌరవపురం జమీందారు గోపరాజు మనవడే రాజు (నవీన్ పోలిశెట్టి). వారసత్వంగా జమీందారు మనవడు అనే పేరు తప్పా.. తాత సంపాదించిన ఆస్తులు ఏవి మిగలకపోవడంతో ఆర్థిక కష్టాలతో సతమతమౌతూ పగటి కలలు కంటూ ఉంటాడు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చు అనే నిర్ణయానికి వస్తాడు. అదే సమయంలో చారులత (మీనాక్షి చౌదరి) ను చూశాక ఆమె తన రాణి అయితే కష్టాలన్నీ గట్టెక్కేయొచ్చు అని భావించి, ఆమె మనసును గెలుచుకోవాలని రంగంలోకి దిగుతారు. మరి చారులత మనసును గెలిచాడా ? ఆమె జీవితంలోకి వచ్చాక రాజు కష్టాలు తొలగిపోయాయా? రాజు రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది? తదితర విషయాలు తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×