E-Paper
Advertisement

Iceland Trolls Pak: టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైన 3 గంట‌ల్లోనే పాకిస్తాన్ ఎలిమినేట్..ఇజ్జ‌త్ తీసిన ఐస్‌లాండ్

Iceland Trolls Pak: టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైన 3 గంట‌ల్లోనే పాకిస్తాన్ ఎలిమినేట్..ఇజ్జ‌త్ తీసిన ఐస్‌లాండ్
Advertisement

Iceland Trolls Pak: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ పరువు తీసింది ఐస్లాండ్ క్రికెట్ బోర్డు. ప్రతి విషయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును గెలుపుతున్న ఐస్లాండ్ క్రికెట్, తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అయిన మూడు గంటల్లోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అయి ఇంటి దారి పడుతుందని పరువు తీసింది ( Iceland Trolls Pak) ఐస్‌లాండ్. తన ప్రారంభ మ్యాచ్ నెద‌ర్లాండ్స్‌ లో ఓడిపోతే కచ్చితంగా పాకిస్తాన్ ఇంటికి వెళ్లడం గ్యారంటీ అని హెచ్చరించింది. ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన నేపథ్యంలో ఈ పరిస్థితులు నెలకొంటాయని హింట్ ఇచ్చింది ఐస్‌లాండ్.

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

టోర్నమెంట్ ప్రారంభమైన మూడు గంటల్లోనే పాకిస్తాన్ ఎలిమినేట్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గ్రూప్ A లో పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ ( Pakistan) బహిష్కరించింది. అది పోగా ఫిబ్రవరి 7వ తేదీన తన తొలి మ్యాచ్ నెదర్లాండ్ తో ఆడనుంది పాకిస్తాన్. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత యూఎస్ఏ తో పాకిస్తాన్ ఆడనుంది. అనంతరం జరిగే ఇండియా తో మ్యాచ్ బహిష్కరణ చేసింది. ఇక చివరగా నమీబియాతో పాకిస్తాన్ తలపడనుంది.

ఇలాంటి నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన నెదర్లాండ్ జట్టుపైన పాకిస్తాన్ ఓడిపోతే మూడు గంటల్లోనే టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎలిమినేట్ కావాల్సిందే అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు (Iceland Cricket ) షాకింగ్ పోస్ట్ పెట్టింది. అలా మూడు గంటల్లోనే ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డు సృష్టించబోతున్నట్లు దారుణంగా ట్రోలింగ్ కూడా చేసింది ఐస్‌లాండ్. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఇండియాతో జరిగే మ్యాచ్ ముందే పాకిస్తాన్ బహిష్కరించింది కాబట్టి.. వాళ్లకు మైనస్ రన్ రేట్ ఉంటుంది. దానికి తోడు నెదర్లాండ్ జట్టుతో ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే.

పాకిస్తాన్ కు వ‌ర్షం కూడా విల‌నే

Advertisement

అంతేకాదు, కొలంబోలో భారీ వ‌ర్షాలు ( Colombo Rains) ప‌డుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే, కొన‌సాగితే, వ‌ర్షం కూడా పాకిస్తాన్ కు విల‌న్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. అప్పుడు కూడా పాకిస్తాన్ తొలి మ్యాచ్ కే ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌. ఇదే జ‌రిగితే, గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు యూఎస్ ఏ ( USA), నెద‌ర్లాండ్స్‌, న‌మీబియాల‌లో ఏదో ఒక టీమ్‌, సూప‌ర్ 8 స్టేజ్ కు వెళుతుంది. పాక్ ఇంటికి వెళ్లాల్సిందే. ఇది ఇలా ఉండ‌గా, టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగితే, త‌మ‌ను తీసుకోవాల‌ని మొద‌టి నుంచి ఐస్ లాండ్ ఇప్ప‌టికే డిమాండ్ చేసింది.

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×