E-Paper
Advertisement

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
Advertisement

Netflix OTT Releases This Week : మే నెల ముగిసి, జూన్ మొదటి వారం ప్రారంభమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ వారం రొమాన్స్, సస్పెన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, స్పోర్ట్స్… ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ఆడియన్స్ ను స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేసే కంటెంట్ తో అలరించడానికి సిద్ధంగా ఉంది. జూన్ 1 నుంచి 7 వరకు విడుదలవుతున్న కొత్త సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి.

1. The Creed Trilogy

మైఖేల్ బి. జోర్డాన్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా సిరీస్ ‘ది క్రీడ్ ట్రయలజీ’. రాకీ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ఈ సిరీస్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. కుటుంబ డ్రామా కూడా ఉంటుంది. జూన్ 1 ఈ స్పోర్ట్స్ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

2. Tourist Family

Advertisement

శశికమార్, సిమ్రాన్ నటించిన తమిళ కామెడీ-డ్రామా ‘టూరిస్ట్ ఫ్యామిలీ. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక నుంచి పారిపోతున్న ఒక కుటుంబం కథ ఇది. హాస్యం, ఎమోషన్ కలగలిసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ జూన్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి రానుంది.

3. Maa Behen

మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రి, ధరణా నటించిన ఫ్యామిలీ డ్రామా. గ్లామరస్ తల్లి నుంచి సీరియల్ కిల్లర్ వరకు విభిన్న పాత్రలు చేసిన మాధురీ ఇప్పుడు ఈ ఎమోషనల్ సినిమాతో తిరిగి వస్తోంది. జూన్ 4 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

4. Office Romance

Advertisement

జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌ స్టెయిన్ నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా. కార్పొరేట్ ఉద్యోగుల జీవితం, ఆఫీస్ గాసిప్, పని-వ్యక్తిగత జీవిత సమతుల్యం మధ్య వికసించే ప్రేమ కథ ఇది. జూన్‌లోని అతిపెద్ద హాలీవుడ్ రిలీజ్‌లలో ఇది కూడా ఒకటి. ఈ సిరీస్ జూన్ 5 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

5. Mexico 86

మెక్సికో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా. ఆటలోని ఉద్వేగం, రాజకీయాలు, గందరగోళం అన్నీ అద్భుతంగా చూపించారు. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు తప్పక చూడాల్సిన చిత్రం. జూన్ 5న ఓటీటీలోకి రానుంది.

6. Poor Things

ఎమ్మా స్టోన్ నటించిన ఈ సైకలాజికల్ డ్రామాలో ఒక మహిళ పునర్జన్మ, స్వేచ్ఛ కోసం చేసే అన్వేషణ, వక్రీకరించబడిన రెండవ జీవితం గురించి ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ. జూన్ 7న నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

Also Read : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 క్రేజీ కే-డ్రామాలు

7. Resident Alien Season 4

ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా సిరీస్ లో ఒక గ్రహాంతరవాసి డాక్టర్ వేషంలో మానవుల మధ్య జీవితం గడుపుతూ, వారిని అర్థం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు చాలా కామెడీగా ఉంటాయి. జూన్ 6న దీన్ని చూడవచ్చు.

8. USA 94: Brazil’s Return to Glory

1994లో బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన గొప్ప జ్ఞాపకాలను తీసుకువచ్చే డాక్యుమెంటరీ సిరీస్. ఫుట్‌బాల్ ప్రేమికులు డోంట్ మిస్. జూన్ 7 నుంచి ఈ స్పోర్ట్స్ డాక్యుమెంటరీని చూడవచ్చు.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×