E-Paper
Advertisement

OTT Movie : మనుషుల్ని ముట్టుకోకుండా చంపే కిల్లర్… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు మావా

OTT Movie : మనుషుల్ని ముట్టుకోకుండా చంపే కిల్లర్… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు మావా
Advertisement

OTT Movie : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలు చివరి వరకూ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంటెన్స్ తో స్టోరీలు ఉంటాయి. క్లైమాక్స్ వరకూ ఇవి ఇచ్చే ట్విస్టులు కూడా అలానే ఉంటాయి. ఈ జానర్ లో వచ్చిన ఒక జాపాన్ మూవీలో దిమ్మ తిరిగే ట్విస్ట్లు ఉంటాయి. ఒక కిల్లర్ కి మనసుని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. దీంతో వరుస హత్యలు చేస్తుంటాడు. సేమ్ పవర్ ఉన్న హీరో అతన్ని ఎలా ఎదుర్కొంటాడన్నదే ఈ కథ. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరేమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘నైట్మేర్ డిటెక్టివ్’ (Nightmare detective) అనే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా షిన్యా సుకామోటో దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ర్యూహీ మత్సుడా, హిటోమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 2006లో ప్రీమియర్ అయింది. ఆ తరువాత జపాన్‌లో 2007 జనవరిలో రిలీజ్ అయింది. 1 గంట 45 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, ఐయండిబిలో 6.0/ 10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాకి సీక్వెల్ ‘నైట్మేర్ డిటెక్టివ్ 2’ 2008లో విడుదలైంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

టోక్యోలో కాగెనుమా అనే డిటెక్టివ్ కి వింత పవర్ ఉంటుంది. అతను ఎవరి కలలోనైనా ఎంటర్ అయి మనసు చదవగలడు. కానీ ఈ పవర్ వల్ల అతను ఎప్పుడూ డిప్రెస్డ్ గా ఉంటాడు. వాళ్ళ మనసులోకి వెళ్ళి రక రకాల ఎమోషన్స్ ని ఫీల్ అవ్వడంతో ఒంటరిగా ఉంటాడు. మరో వైపు కిరిషిమా అనే కూల్ పోలీస్ ఆఫీసర్, కొత్తగా స్టేషన్‌కి వస్తుంది. వచ్చి రాగానే రెండు సూసైడ్ కేసులు చూస్తుంది. ఇద్దరు నిద్రలో రేజర్‌తో గొంతు కోసుకుని చనిపోయారు. ఇది సూసైడ్ అని భావించి అందరూ కేస్ క్లోజ్ చేయాలని అనుకుంటారు.

Read Also : వరుసగా ప్రెగ్నెంట్ అయ్యే జైల్లో ఉన్న అమ్మాయిలు… మెంటల్ మాస్ ట్విస్టులున్న మిస్టరీ థ్రిల్లర్

Advertisement

అయితే కిరిషిమా ఇవి సూపర్‌ నాచురల్ మరణాలుగా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆమె కాగెనుమాను గురించి తెలుసుకుని అతనికి ఫోన్ చేస్తుంది. వీళ్ళంతా జీరో నెంబర్ కి కాల్ చేసిన తరువాత చనిపోయారని తన పవర్ ద్వారా తెలుసుకుంటాడు. కాగెనుమాకి ఉన్న పవర్ విలన్ కి కూడా ఉంటుంది. అతను ఆ పవర్ మిస్ యూస్ చేసి వేరే వాళ్ళని సూసైడ్ చేసుకునేలా ప్రభావితం చేస్తుంటాడు. ఇప్పుడు కాగెనుమా రిస్క్ తీసుకుని, విలన్ కలలోకి వెళ్లి ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారు ? కిరిషిమా ఈ హత్యలకు అడ్డుకట్ట వేస్తాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×