E-Paper
Advertisement

IBomma Ravi: చంచల్ గూడ జైలుకు ఐబొమ్మ నిర్వాహకుడు రవి

IBomma Ravi: చంచల్ గూడ జైలుకు ఐబొమ్మ నిర్వాహకుడు రవి
Advertisement

IBomma Ravi: తెలుగు సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగించిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ (iBOMMA) ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచిన అనంతరం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గత కొంతకాలంగా ఇమ్మడి రవి కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీసీఎస్ పోలీసులు ఆమ్‌స్టర్‌డామ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన రవిని కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాలో ఉన్న అతని నివాసంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అతని వద్ద నుంచి పైరసీకి సంబంధించిన కీలక మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినిమా పైరసీకి వ్యతిరేకంగా సినీ నిర్మాతల నుండి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

Advertisement

రవి నిర్వహించిన iBOMMA , BAPPAM వెబ్‌సైట్‌లను పోలీసులు తక్షణమే బ్లాక్ చేశారు. పైరసీ ద్వారా ఆర్జించినట్టు భావిస్తున్న సుమారు రూ. 2.5 కోట్ల నగదును రవి ఖాతా నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇమ్మడి రవి సుమారు 5 సంవత్సరాల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్టు సమాచారం.

ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపి, పైరసీ నెట్‌వర్క్‌లోని ఇతర వివరాలను తెలుసుకోవడం కోసం ఇమ్మడి రవిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరారు. థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే లేదా ఓటీటీలో వచ్చిన వెంటనే సినిమాలను పైరసీ చేసి ఉచితంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇమ్మడి రవి అరెస్ట్‌తో పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: GlobeTrotter Event : గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో నిరాశ, మేనేజ్ చెయ్యలేక సారీ చెప్పేసారు 

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×