BigTV English

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!


OTT Movies: మీకునా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమరీస్’, ‘ప్రేమమ్’ మూవీస్ అంటే ఇష్టమా? అయితే, తప్పకుండా ఈ మూవీ కూడా నచ్చేస్తోంది. అన్నట్టు.. ఈ మూవీలోని ఓ సాంగ్.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి.. కాలేజ్‌లో తన జూనియర్‌ను ఇష్టపడుతుంది. తనని అక్కా అని పిలవద్దని చెబుతుంది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడతారు. మేడపై రొమాన్స్ చేస్తారు. ఆ తర్వాతి ఓ రోజు ఆ అమ్మాయి అతడికి హ్యాండ్ ఇస్తుంది. తనని పేరు పెట్టి పిలవద్దు. అక్కా అని పిలవమని వార్నింగ్ ఇస్తుంది. ఈ సీన్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ మూవీని మీకు కూడా చూడాలని ఉందా? అయితే.. ముందుగా కథ తెలుసుకోండి.

కథేంటంటే..


ప్రముఖ తమిళ నటుడు.. విష్ణు విశాల్ నిర్మించిన రొమాంటిక్, కామెడీ మూవీ ‘ఓహో ఎంతన్ బేబీ’ (Oho Enthan Baby) థియేటర్‌లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలోని సాంగ్స్ కూడా హిట్టే. ఇది కూడా ఒక ప్రేమికుడి ‘బయోపిక్’ అనుకోవచ్చు. ఇక కథలోకి వెళ్తే.. 

అశ్విన్‌(రుద్ర)కు డైరెక్టర్ కావాలనేది కల. అందుకే అసిస్టెంట్ డైరెక్టుగా పనిచేస్తుంటాడు. ఏదో ఒక రోజు సొంతంగా సినిమా తియ్యాలనే లక్ష్యంతో కసిగా పనిచేస్తుంటాడు. తన జీవితాన్నే బిగ్ స్క్రీన్‌పై చూపించాలని కలలు కంటాడు. తన జీవితంలో ఎదుర్కొన్న ప్రేమ, బ్రేకప్ వంటి విషయాలనే కథగా మలిచి.. స్క్రీప్ట్ రెడీ చేస్తాడు. మరోవైపు.. మీరా (మిథిలా పాల్కర్) అనే డాక్టర్‌‌ను ప్రేమిస్తాడు. ఆమెతో గడిపే ప్రతి క్షణాన్ని తన సినిమా కథలో ఊహిస్తుంటాడు. అయితే, అశ్విన్ లక్ష్యం.. అతడి ఊహల్లోనే బతికేస్తుండటం.. ఆమెకు నచ్చదు. ఇద్దరికీ స్పర్థలు వస్తాయి. దీంతో తన జీవిత కథను తెరపై చూపించి.. మీరాకు తన ప్రేమను నిరూపించుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. అతడు తయారు చేసిన స్క్రీప్ట్‌‌తో హీరో విష్ణు విశాల్‌‌ను కలుస్తాడు.

అసలు కథ మొదలయ్యేది ఇప్పుడే..

అశ్విన్ తన స్క్రిప్ట్‌ను విష్ణు విశాల్‌కు వినిపిస్తాడు. తన ప్రేమకథను మూడు దశల్లో వివరిస్తాడు. ముందుగా తన టీనేజ్ ప్రేమ గురించి చెబుతాడు. ఈ సందర్భంగానే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసిన సాంగ్ వస్తుంది. అందులోనే అతడి టీనేజ్ లవ్ చూపిస్తారు. ఆ తర్వాత వయస్సు వచ్చిన తర్వాత లవ్.. ప్రస్తుతం మీరాతో ఉన్న లవ్ గురించి కథలా చెబుతాడు. కథ మొత్తం విన్న తర్వాత.. స్క్రీప్ట్‌లో ఏదో లోపం ఉందని, దాన్ని సరిచేసుకోవాలని విష్ణు విశాల్ సూచిస్తాడు. “నీ కథలో నువ్వు.. నీ తప్పులను ఒప్పుకోవడం లేదు. నువ్వు నీ ప్రేమను మళ్లీ గెలవాలంటే.. ముందుగా నీ తప్పులను సరిదిద్దుకో” అని సలహా ఇస్తాడు. ఈ మాటలు అశ్విన్‌ను ఆలోచింపజేస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఓటీటీలో చూడండి. Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులోనూ ఉంది. ఫ్యామిలీతో చూస్తున్నప్పడు జాగ్రత్త.. కొన్ని రొమాంటిక్, ముద్దు సీన్లు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ మూవీకి జెన్ మార్టిన్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. చివరిగా.. ఒక ఫీల్-గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.

Also Read: OTT Movie: డబ్బున్న ఆంటీలను నిలువ దోపిడి చేసే అందగాడు.. వాడి ఆట కట్టించే కిలాడి, ఈ మూవీ పెద్దలకు మాత్రమే!

Related News

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

OTT Movie : ఫన్ కోసం ఆడిన గేమ్ రియల్ లైఫ్ లోకి… ప్రతీ మాస్క్ వెనుక ఓ నిజం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ప్రియురాలి గదిలోకి స్నేహితున్ని పంపే ప్రియుడు … ముసలోడి నుంచి నిక్కరేసుకున్న వాడి దాకా…

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

Big Stories

×