Follow 2025 movie Review in Telugu: మీకు మాంచి రొమాంటిక్.. థ్రిల్లర్ చూడాలని ఉందా? అయితే, ఈ మూవీ ట్రై చెయ్యండి. ఈ మూవీ టైటిల్ ‘ఫాలో’. కేవలం మీరు మాత్రమే ఒంటరిగా చూడాల్సిన చిత్రం. అలాగని ఇది పెద్దల చిత్రమని చెప్పడం లేదు. మాంచి థ్రిల్ ఇచ్చే స్టోరీ కూడా ఉంటుంది. కానీ, కొన్ని సీన్లు మోతాదు మించి ఉంటాయి. అందుకే, ఒంటరిగా చూడాలని సజెస్ట్ చేస్తున్నాం. ఇక ఈ మూవీ కథలోకి వెళ్తే…
ఇదీ కథ: సెబాస్టియన్ (డియెగో బోనెటా) చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. కానీ, వీడు చాలా పెద్ద మోసగాడు. సెబాస్టియన్‌ను చూస్తే ఎలాంటి ఆడవాళ్లైనా అట్టే ప్రేమలో పడిపోతారు. దాన్నే అతడు అవకాశంగా చేసుకుని మెక్సికోలోని ధనవంత మహిళలతో మాటలు కలిపి.. వారితో పడుకుని.. వారి డబ్బు, నగలు దొంగిలించి మాయమవుతాడు. సెబాస్టియన్‌కు అతడి స్నేహితుడు మాక్లో (అలెజాండ్రో స్పీట్జర్) సహాయం చేస్తుంటాడు. సెబాస్టియన్ దీన్ని ఒక ఆటగా చూస్తాడు. బాగా డబ్బున్న అమ్మాయిలు, లేదా ఆంటీలను గుర్తించడం.. వారిని లక్ష్యం చేసుకోవడం.. వారి నమ్మకాన్ని గెలుచుకుని.. వారి సంపదను దోచుకోవడం.. ఇవే అతడి లక్ష్యాలు. అతడికి ఎలాంటి సెంటిమెంట్స్, భావోద్వేగాలు ఉండవు. బాగా సెల్ఫిష్‌లా ఉంటాడు. అందుకే, అతడు సంబంధం పెట్టుకున్న ఏ మహిళతోనూ అతడికి కనెక్షన్స్ ఉండవు. వారి గురించి ఆలోచించడు.
మోసాలకు పుల్ స్టాప్ పెట్టేయాలనే క్షణంలో..
ఒక రోజు సెబాస్టియన్ ఇక మోసాలకు పుల్‌స్టాప్ పెట్టేసి.. సంపాదించిన దానితో హాయిగా బతకాలని డిసైడ్ అవుతాడు. అయితే, అనుకోకుండా ఒక రోజు కారు ప్రమాదంలో.. కరోలినా (మార్తా హిగరేడా) అనే అందమైన మహిళను కలుస్తాడు. కరోలినా.. బాగా పేరొందిన వ్యక్తి ఏంజెల్ కొర్రియా (అల్బెర్టో గుయెర్రా)కు భార్య. ఏంజెల్ కొర్రియాకు హింసకు మారు పేరు. అలాంటి వ్యక్తి భార్యతో సెబాస్టియన్ ప్రేమలో పడతాడు. కరోలినా తన భర్త ఏంజెల్‌తో సంతోషంగా లేదని సెబాస్టియన్ తెలుసుకుంటాడు. ఆమెను అతడి నుంచి విడిపించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అనుకోకుండానే ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. అంతేగాక.. ఎవరికీ తన మనసులో చోటు ఇవ్వకూడదనే రూల్ కూడా పక్కన పెట్టేస్తాడు. అదే కథను మరో మలుపు తిప్పుతుంది.
కరోలినా మరింత కంత్రి..
ఎంత ప్రేమలో పడినా.. పక్కోడి సొమ్ము కొట్టేయాలనే పాడుబుద్ధి ఎక్కడికి పోద్ది. కరోలినాతో ప్రేమలో ఉంటూనే.. ఆమె భర్త సంపదను కాజేయాలని సెబాస్టియన్ ప్లాన్ చేస్తాడు. కరోలినాను పావులా వాడుకోవాలని చూస్తాడు. కానీ, కరోలినా వాడి కంటే కంత్రి. సెబాస్టియన్ ఉద్దేశాలను తెలుసుకుని.. అతడిని ఓ ఆట ఆడుకుంటుంది. అది ఎలాంటి ఆటో తెలియాలంటే తప్పకుండా మీరు బుల్లి తెరపైనే చూడాలి. ఈ మూవీ పేరు ‘Follow’. ఈ మూవీ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు. కానీ, ఇందులో కొన్ని పెద్దల సన్నివేశాలు ఉంటాయి. అలాంటి సీన్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సడన్‌గా వస్తాయి. కాబట్టి.. ఒంటరిగా.. ఇంట్లో ఎవరూలేనప్పుడు ఏకాంతంగా చూడటమే బెటర్.
Also Read: Rashi Singh: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరోయిన్ రాశీ సింగ్.. వీడియో వైరల్