Anupama: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) .. నితిన్ (Nithin ) , సమంత(Samantha ) జంటగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వచ్చిన ‘అ ఆ’.. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాలో హద్దులు చెరిపేసి మరీ నటించిన ఈమె.. తొలిసారి స్కర్ట్ వేసుకొని, లిప్ కిస్ సన్నివేశాలలో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా హోమ్లీ పాత్రలు చేస్తూ.. చాలా సాంప్రదాయంగా కనిపించిన అనుపమ.. ఏంటి సడన్గా ఇలాంటి పాత్ర చేసింది అని అందరూ ఆశ్చర్యపోయారు..
టిల్లు స్క్వేర్ సినిమా కంఫర్ట్ గా చేయలేదు – అనుపమ
ముఖ్యంగా దీనికి సమాధానం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుండగా.. ఇన్నాళ్లకు వాటన్నింటికీ స్వయంగా అనుపమ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ‘పరదా’ అంటూ మరో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయగా.. ఆ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తున్నారు టీం. ఇక అందులో భాగంగానే తాజాగా అనుపమ కూడా ఒక ఇంటర్వ్యూకి హాజరయింది. ఆ ఇంటర్వ్యూలో టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్నప్పుడు.. తాను కంఫర్ట్ గా లేననే విషయాన్ని బయటపెట్టి అందరి ఆలోచనలకు చెక్ పెట్టింది.
ఈ సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నాను – అనుపమ
తాజాగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “టిల్లు స్క్వేర్ సినిమాలో నా అభిమానులకు ఆ పాత్ర నచ్చలేదని కాదు కానీ.. నేను అలాంటి పాత్ర చేయడం నచ్చలేదు. ముఖ్యంగా ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టింది. అసలు చేయాలా.. వద్దా .. అని ఎంతో సమయం తీసుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే.. ఈ సినిమాలో పాత్ర కోసం నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. సెట్ కి వెళ్లి 100% కాన్ఫిడెంట్ గా చేసిన సినిమా కూడా కాదు అది. పైగా అటు సినిమాలో కానీ ఇటు ప్రమోషన్స్ లో కానీ అలాంటి డ్రెస్సులు వేసుకోవడం కంఫర్ట్ గా అనిపించలేదు. మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఇది ఒక ఛాలెంజ్ లా అనిపించింది. ఈ సినిమా విడుదలయ్యాక ఈ క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారో అనే అనుమానాలు నాలో ఎక్కువ అయ్యేవి.
విమర్శల్ని కూడా తట్టుకోగలిగాను – అనుపమ
కానీ సినిమా రిలీజ్ అయ్యాక నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. హీరోకి సమానంగా ఆ పాత్ర ఉందని అందరూ అన్నారు. అయితే ఆ సినిమా చేసిన తర్వాత విమర్శలు వస్తాయని.. ముందే ఊహించాను. కానీ అదే జరిగింది. ఇక విమర్శల్ని కూడా తట్టుకోగలిగాను” అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. సినిమాలో తాను భయంగానే చేసినా.. తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చిందని, కానీ ఒకరకంగా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది అనుపమ.
ALSO READ: Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడే.. ప్లేస్ తోనే అంచనాలు పెంచేశారుగా!