E-Paper
Advertisement

Oscar 2026 Movies on OTT : ఆస్కార్ రేసులో ఉన్న టాప్ 10 సినిమాలు… ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Oscar 2026 Movies on OTT : ఆస్కార్ రేసులో ఉన్న టాప్ 10 సినిమాలు… ఏ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Oscar 2026 Movies on OTT : ఆస్కార్ 2026 నామినేషన్స్ అధికారికంగా 2026 జనవరి 22న అనౌన్స్ అయ్యాయి. ఆస్కార్ నామినేషన్ల జాబితాను చూసి హిందీ సినిమా ప్రేమికులు ఆశ్చర్యపోయారు. హోమ్‌బౌండ్ చిత్రం నామినేషన్లలో ఉంటుందని భావించినా, ఆ సినిమా చోటు మాత్రం దక్కించుకోలేక పోయింది. ఈ సంవత్సరం రికార్డ్ బ్రేకింగ్ నామినేషన్స్ అయితే కొన్ని సినిమాలకు వచ్చాయి. Ryan Coogler దర్శకత్వంలోని ‘Sinners’ సినిమా16 నామినేషన్స్‌తో టాప్‌లో ఉంది. ‘One Battle After Another’ 13తో రెండో స్థానంలో ఉంది. ఇక 2026 మార్చి 15 నుంచి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇక ఆస్కార్ బరిలో ఉన్న సినిమాల ఏమిటి ? ఏ ఓటీలో ఉన్నాయి ? అనే విషయాలను తెలుసుకుందాం.

ఆస్కార్ బరిలో ఉన్న టాప్ సినిమాల లిస్ట్

One Battle After Another : (Paul Thomas Anderson, Leonardo DiCaprio లీడ్) : అత్యధికంగా 13 నామినేషన్స్ తో ఈ మూవీ ఆస్కార్ బరిలో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమా HBO Max, JioHotstar లో చూడవచ్చు.

Frankenstein : గిల్లెర్మో డెల్ టోరో దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ సై-ఫై JioHotstar, నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూడవచ్చు.

Train Dreams : క్లింట్ బెంట్లీ దర్శకత్వం, Joel Edgerton లీడ్ రోల్ లో ఉన్న ఈ పీరియడిక్ డ్రామా Netflix లో చూడచ్చు.

Bugonia : మీరు ఇంకా బుగోనియా సినిమా చూడకపోతే, మీరు దాన్ని పీకాక్‌లో చూడచ్చు. ఈ సినిమా జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.

F1 : బ్రాడ్ పిట్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా Formula 1 థీమ్ తో ఉంటుంది. Apple TV+, Prime Videoలో దీనిని చూడవచ్చు.

Hamnet : ఈ షేక్‌స్పియర్ ఫ్యామిలీ డ్రామా ఇంకా థియేటర్లలో ఉంది. త్వరలో Peacock/Prime Videoలో వస్తుంది.

Marty Supreme : జోష్ దర్శకత్వంలో వచ్చిన ఈ టేబుల్ టెన్నిస్ డ్రామా కూడా ఇంకా ఇంకా థియేటర్లలో ఉంది. Apple TV, Prime Videoలో త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Sentimental Value : Joachim Trier దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా జనవరి 23 నుంచి Prime video లో స్ట్రీమ్ అవుతోంది.

The Secret Agent : ఈ బ్రెజిల్ మూవీ Prime Video, Apple TV+, Fandangoలో అందుబాటులో ఉంది.

ఈ మూవీలు ఎక్కువగా Netflix, JioHotstar, Prime Video, Apple TV+లో ఉన్నాయి. కొన్ని థియేటర్లలో ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి ఓటీటీ రిలీజ్ త్వరలో వస్తుంది. ఇక ఆస్కార్ విన్నర్స్ ఎవరో మార్చి 15 అనౌన్స్ అవుతాయి.

Read Also : గణతంత్ర దినోత్సవానికి ముందు ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన 5 మలయాళ వార్ డ్రామాలు

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×