E-Paper
Advertisement

Republic Day 2026 : గణతంత్ర దినోత్సవానికి ముందు ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన 5 మలయాళ వార్ డ్రామాలు

Republic Day 2026 : గణతంత్ర దినోత్సవానికి ముందు ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన 5 మలయాళ వార్ డ్రామాలు

Republic Day 2026 : గణతంత్ర దినోత్సవం సమయంలో దేశభక్తి సినిమాలను చూడాలని ఉందా ? అయితే ఈ మలయాళం సినిమాలపై ఓ లుక్ వేయండి. ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలసి దేశభక్తి భావాలను పంచుకోండి. యుద్ధం, పోరాటం, ప్యాట్రియాటిజం థీమ్స్‌తో ఉన్న టాప్ మలయాళం మూవీలు ఇవే. మరి ఇందులో మీరెన్ని చూశారు.

1. కీర్తి చక్ర (Keerthi Chakra – 2006)

మోహన్‌లాల్ సూపర్ పర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ వార్ యాక్షన్ డ్రామా జమ్మూ కాశ్మీర్‌లో నిజమైన టెర్రర్ సంఘటనల ఆధారంగా తీసింది. మేజర్ మహాదేవన్ (మోహన్‌లాల్) NSG కమాండో టీమ్‌ను లీడ్ చేసి హజ్రత్‌బల్ శ్రైన్ అటాక్‌ను ఎదుర్కొంటాడు. తమిళ నటుడు జీవా మలయాళ డెబ్యూ చేసిన ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్ కావాల్సినంత ఉంటుంది. 2 గంటల 24 నిమిషాలు ఈ మూవీ JioHotstarలో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

2. కేరళ వర్మ పజస్సి రాజా (Kerala Varma Pazhassi Raja – 2009)

మమ్మూట్టి పజస్సి రాజాగా అద్భుతంగా నటించిన ఎపిక్ పీరియడ్ వార్ డ్రామా ఇది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వయనాడ్‌లో గెరిల్లా యుద్ధం చేసిన ఒక రాజా కథ. దేశభక్తిని ఇందులో బాగా చూపించారు. దాదాపు 3 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాని JioHotstarలో చూడవచ్చు.

3. 1921 (1988)

1988లో విడుదలైన ఈ మలయాళం సినిమాకి I. V. శశి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి, మధు, సురేష్ గోపి, టి.జి.రవి, సీమ, ఊర్వశి, ముఖేష్‌ వంటి నటులు నటించారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో 1921-22 మాప్పిలా తిరుగుబాటు సమయంలో ఇది జరుగుతుంది. అప్పట్లో కోటి బడ్జెట్‌తో రూపొందింది. మలయాళంలో అత్యంత ఖరీదైన చిత్రంగా కూడా దీనికి రికార్డ్ ఉంది. ఈ చిత్రం కేరళలో 1988 ఆగస్టు ఓనం పండుగ సందర్భంగా విడుదలైంది. ఇది ఉత్తమ చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. JioHotstarలో ఈ సినిమా ఉంది.

4. పాదయోట్టం (Padayottam – 1982)

ప్రేమ్ నజీర్, మధు, మమ్మూట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్స్‌తో ఉన్న ఎపిక్ పీరియడ్ డ్రామా. అలెగ్జాండర్ డ్యూమాస్ “ది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో” ఆధారంగా ఉత్తర కేరళలోని ఒక రాజ్యంలో ఈ కథ సెట్ చేశారు. ఇది భారతదేశంలో మొదటి 70mm ఫార్మాట్ మూవీ. 2 గంటల 11 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాను SunNXTలో చూడవచ్చు.

5. ఉరుమి (Urumi – 2011)

పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్‌ రోల్ లో సంతోష్ శివన్ దర్శకత్వంలో తీసిన హిస్టారికల్ ఎపిక్ వార్ డ్రామా ఇది. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా, ఒక కేరళ యోధుడు అయిన చిరక్కల్ కేలు నాయనార్ ప్రతీకారం తీర్చుకునే కథ. అద్భుతమైన విజువల్స్, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్, ఆర్య, ప్రభుదేవా, జెనీలియా, నిత్యా మీనన్ లాంటి కాస్ట్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 2 గంటల 29 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా స SunNXT లో అందుబాటులో ఉంది.

Read Also :  ఓటీటీలోకి రానున్న ఫిబ్రవరి మోస్ట్ అవైటింగ్ మలయాళం మూవీస్… ఏ మూవీ ఏ ఓటీటీలో ?

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×